365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 26,2022: అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమకు భవిష్యత్తులోనూ ఉపయోగప డేందుకు సిద్ధంగా ఉన్న సేవలు అందించే ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన పెన్నాంట్ టెక్నాలజీస్ తన కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని భారతదేశంలోని హైదరాబాద్ నగరంలో గల సైబర్ గేట్‌వే వద్ద తెరిచినట్లు శనివారం ప్రకటించింది. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త కార్యాలయం తదుపరి తరం ఉత్పత్తులను అందించి, తన కస్టమర్ల వ్యాపార ఉత్పత్తులను పెంపొందించేందుకు కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ ఐఏఎస్ (రిటైర్డ్) ఈ కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ టెక్నాలజీ హబ్ నడిబొడ్డున ఉన్న కొత్త ఆఫీసు పెద్దది, విశాలమైనది, మెరుగైన పని వాతావరణం, అనుభవాన్ని అందించడానికి అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడి ఉంది. సుమారు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్పొరేట్ కార్యాలయం ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారితో సహా 220 మందికి పైగా అసోసియేట్లకు సరిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలలో 250 మందికి పైగా అసోసియేట్లతో పనిచేస్తున్న ఈ కంపెనీ.. రాబోయే 18 నెలల కాలంలో తన ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తోంది.
2005లో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి, పెన్నాంట్ నిరంతరం వృద్ధి సాధిస్తోంది. ప్రపంచ బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమలో నిరంతరం మారుతున్న అవసరాలను సమర్థంగా పరిష్కరించేందుకు సరిపోయే సరైనసాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది. కొన్నేళ్లుగా, పెన్నాంట్ మిడిల్ ఈస్ట్, యూరప్, భారతదేశంలోని 45కు పైగా ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వాటన్నింటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమలోని అన్ని అవసరాలనూ తీర్చే వ్యాపార ఆధారిత సాఫ్ట్ వేర్లను విజయవంతంగా అందించింది. ఇంకా, పెన్నాంట్ ఉత్పత్తులు భారతదేశం, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని 18 ఆర్థిక సంస్థలకు సేవలు అందిస్తున్నాయి.
ఈ సందర్భంగా పెన్నాంట్ టెక్నాలజీస్ డైరెక్టర్ ,సీఈవో రామకృష్ణ రాజు మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలోని మా కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించినందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ప్రత్యేకించి మార్కెట్లో మా ఉత్పత్తికి అద్భుతమైన ఆదరణ చూస్తున్న సమయంలో ఈ కార్యాలయం ప్రారంభమైంది. పెన్నాంట్ ఇప్పుడు వృద్ధి దశలో ఉంది. అంతర్జాతీయ కస్టమర్లకు నిరంతరం మారే అవసరాలను సమర్థంగా తీర్చేందుకు మా ప్రణాళికలకు ఈ పెద్ద కేంద్రం సరిగ్గా సరిపోతుంది. కృత్రిమ మేధ, క్లౌడ్, ఆటోమేషన్ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన రాబోయే తరం ఉత్పత్తులను మా కస్టమర్లకు అందించడానికి ఈ కేంద్రంతో సమకూరిన బలం మాకు వీలు కల్పిస్తుంది” అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజీవ్ శర్మ, హైసియా ఉపాధ్యక్షుడు కిరణ్ చెరుకూరి, వాణిజ్యవేత్త సునీల్ చలమలశెట్టి, పెన్నాంట్ టెక్నాలజీస్ సీఈవో మరియు డైరెక్టర్ రామకృష్ణరాజు, పెన్నాంట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రదీప్ వర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ కన్సల్టింగ్ డైరెక్టర్ దాట్ల రవివర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పి.ఎ. శ్రీనివాసవర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ విభాగాధిపతి డి. రామకృష్ణ వర్మ, పెన్నాంట్ టెక్నాలజీస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాధిపతి ఎస్. రవి తదితరులు పాల్గొన్నారు.
గత 16 సంవత్సరాలుగా, పెన్నాంట్ అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అవసరాలను తీరుస్తోంది. రుణాలు, చెల్లింపుల ప్రాసెసింగ్, కోర్ బ్యాంకింగ్, ఇస్లామిక్ ఫైనాన్స్ రంగాలలో వారికి సేవలు అందిస్తోంది. కంపెనీ ప్రధాన ఉత్పత్తులలో ఒకటైన పెన్‌యాప్స్ లెండింగ్ ఫ్యాక్టరీతో సహా కంపెనీ ఉత్పత్తులు, అధిక కాన్ఫిగరబిలిటీ, ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ ఆర్కిటెక్చర్, ఏపీఐ ఎనేబుల్డ్ డిజిటల్ సామర్థ్యాలపై ఒక నిర్దిష్ట దృష్టితో రూపొందాయి. పెన్నాంట్ ఇప్పటికే విజయవంతంగా అందించి, అమలుచేస్తున్న ఉత్పత్తుల్లో..
భారతదేశంలో ఒక పెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కోసం అతిపెద్ద మల్టీ-సెగ్మెంట్ లెండింగ్ ప్లాట్‌ఫాం, ఖతార్ దేశంలోని ఒక పెద్ద బ్యాంకు కోసం పేమెంట్స్ ప్రాసెసింగ్, భారతదేశంలో ఒక హోమ్ ఫైనాన్స్ కంపెనీ కోసం గ్రీన్‌ఫీల్డ్ లోన్ ఆరిజినేషన్ సిస్టం, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని ప్రముఖ బ్యాంకుల కోసం ఇస్లామిక్ ఫైనాన్స్ పరిష్కారాలు, 16 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కోర్ సిస్టం అందించడం లాంటివి ఉన్నాయి. పెన్నాంట్ తన ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ గుర్తింపులు, అవార్డులను గెలుచుకుంది. ఏజిస్ గ్రాహం బెల్ అవార్డ్స్ (ఇన్నోవేటివ్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫర్ బ్యాంకింగ్ కేటగిరీ) లో ఫైనలిస్ట్ గా నిలిచింది. కన్స్యూమర్ లోన్ సిస్టమ్స్ కోసంఎవరెస్ట్ గ్రూప్ పీక్ మ్యాట్రిక్స్ అసెస్‌మెంట్‌లో ప్రధాన పోటీదారుగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ బిజినెస్ అవార్డులలో కాంస్య పతకం పొందింది.
మరింత సమాచారం కోసం, సందర్శించండి: http://www.pennanttech.com/
పెన్నాంట్ టెక్నాలజీస్ గురించి
పెన్నాంట్ టెక్నాలజీస్ అనేది ఒక చురుకైన, సృజనాత్మకమైన ఫిన్ టెక్ కంపెనీ. ఇది అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సేవల కంపెనీల కోసం భవిష్యత్తులో వాడగల, సులభంగా అందుకోగల, కాన్ఫిగర్ చేయదగిన ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. మా కస్టమర్-సెంట్రిక్ అప్రోచ్, మార్కెట్-సెంట్రిక్ ఇన్నోవేషన్ వల్ల మా క్లయింట్లు తమ వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మార్చుకోడానికి, విభిన్న కస్టమర్ అనుభవాలను అందించడానికి, పోటీలో నిలబడేందుకు వీలవుతుంది. కస్టమర్ అనుభవం, లెండింగ్ ఆపరేషన్స్, పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టంలు, స్పెషలైజ్డ్ ఇస్లామిక్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ కోసం మేం చురుకైన సాఫ్ట్ వేర్ సొల్యూషన్లను అందిస్తాం.
2005 లో ప్రారంభించిన పెన్నాంట్ టెక్నాలజీస్ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని హైదరాబాద్ నగరంలో ఉంది. యూకే, దుబాయ్, హైదరాబాద్ మరియు విశాఖపట్నాల్లో కార్యాలయాలు, టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి. మరింత తెలుసుకోడానికి సందర్శించండి: http://www.pennanttech.com/