365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 29,2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీనిలో 1654 గెస్ట్ లెక్చరర్స్, 449 కాంట్రాక్ట్, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకులు ఉంటారు.

ఈ పోస్టులను వచ్చే ఏడాది మార్చి 31 వరకు భర్తీ చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90 రోజుల్లో 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు.

ఇక, త్వరలోనే 35,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేస్తున్నామని, ఈ సంవత్సరం 2,000 మందికి శిక్షణ ఇచ్చి, వచ్చే ఏడాది 20,000 మందికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు.