365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగష్టు 1,2025: దేశవ్యాప్తంగా ఉన్న మర్చంట్‌ ఎకోసిస్టమ్‌ను మరింత శక్తివంతం చేయడానికి డిజిటల్ పేమెంట్‌ దిగ్గజం ఫోన్‌పే ఓ కీలకమైన వ్యూహాత్మక చర్యగా ‘ఆఫ్‌లైన్ భాగస్వామి కార్యక్రమం’ ను ప్రారంభించింది.

ఈ కార్యక్రమం ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ (POS) బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లు, ERP సిస్టమ్‌లు, వెండింగ్ మెషీన్లు, సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు అందించే సర్వీస్ ప్రొవైడర్లు తమ కస్టమర్లను ఫోన్‌పే ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్‌ వైపు రిఫర్ చేయవచ్చు. ఇందుకు మార్జిన్‌గా వారికి అనుకూలంగా డిజైన్ చేసిన కస్టమైజ్డ్ రెఫెరల్ కమీషన్లు లభిస్తాయి.

ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్లు తమ క్లయింట్లకు సమగ్రమైన బిల్లింగ్, పేమెంట్ సొల్యూషన్స్‌ను అందించగలిగే సామర్థ్యం పొందుతారు. ఫలితంగా, వారు వ్యాపారాల పెరుగుదలలో భాగస్వాములుగా మారడమే కాకుండా, నమ్మదగిన సాంకేతిక భాగస్వాములుగా గుర్తింపు పొందతారు.

ఫోన్‌పే ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్‌ను బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కి అనుసంధానించడం ద్వారా వ్యాపారులు చాలా తక్కువ సమయంలో (కొన్ని గంటల్లోనే) సేవలను ప్రారంభించవచ్చు. దీని ద్వారా వినియోగదారులకు సులభమైన పేమెంట్ అనుభవం కలుగుతుంది.

ఇది కూడా చదవండి…మెహర్ రమేష్ చేతుల మీదుగా విడుదలైన ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బన్ బటర్ జామ్’ టీజర్.. ఆగస్టు 8న సినిమా గ్రాండ్ రిలీజ్..
ఈ సొల్యూషన్స్‌లో:

  • ఇంటిగ్రేటెడ్ POS పరికరాలు
  • ప్రతి లావాదేవీకి ప్రత్యేకమైన కోడ్‌తో కూడిన డైనమిక్ క్యూఆర్‌లు
  • SMS ద్వారా పంపే పేమెంట్ లింకులు
    వంటి పలు అనుభవజ్ఞత కలిగిన టెక్-ఆప్షన్లు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో చేరాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లు ఆఫ్‌లైన్ భాగస్వామి కార్యక్రమం పేజీని సందర్శించవచ్చు లేదా offlinepartner-support@phonepe.com కు మెయిల్ చేయవచ్చు.

రిజిస్ట్రేషన్ అనంతరం ఫోన్‌పే టీం ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పూర్తిగా తోడ్పడుతుంది. ఇందులో పాల్గొనడం ద్వారా వారు తగిన కమీషన్లతో పాటు, అనేకమంది వ్యాపారులకు ఆధునిక డిజిటల్ చెల్లింపు పరిష్కారాలు అందించగలుగుతారు.