365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,జనవరి 28,2022:భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ వేదిక ఈ రోజు ప్రకటించింది. PhonePe Pulse ద్వారా సేకరించిన
నాలుగో త్రైమాసిక ( అక్టోబర్ – డిసెంబర్) 2021 ఫలితాలలోని కీలక ఒరవడులను భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ వేదిక ఈ రోజు ప్రకటించింది. ఈ నివేదికను బట్టి చూస్తే,భారతదేశం వేగంగా డిజిటల్ పేమెంట్లను స్వీకరిస్తున్న విషయం వెల్లడవుతోం దని తెలిపింది.

ఈ త్రైమాసిక నివేదికలోని ముఖ్యాంశాలు:

  1. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో PhonePe వేదిక 26% వృద్ధితో 6.63 బిలియన్ లావాదేవీలను నమోదు చేసుకుంది.
  2. ప్రాసెస్ చేసిన లావాదేవీల మొత్త పేమెంట్ల విలువ (TPV) 26% వృద్ధితో $155 బిలియన్లకు చేరింది.తద్వారా లావాదేవీల సంఖ్యలో వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది.
  3. UPIతో నగదు బదిలీలు,మర్చంట్ పేమెంట్లు యథా ప్రకారం భారీగా పెరుగుదలను నమోదు చేసుకుని, వరుసగా 2.72 బిలియన్లు,3.15 బిలియన్లకు చేరుకుంది.
  4. భారతదేశం నలుమూలల్లోని సుమారు 15,700 పట్టణాలు,గ్రామాలలో ఉన్న సుమారు 25 మిలియన్ మర్చంట్లు డిజిటల్ బాట పట్టారు. ఆఫ్ లైన్ మర్చంట్ పేమెంట్లు గొప్ప అభివృద్ధి సాధించడంలో ఇది సహాయపడుతోంది.అంతేకాక, మూడో త్రైమాసికంలో ఉన్న విధంగానే డిజిటల్ పేమెంట్ల ఒరవడి దేశం మొత్తం వ్యాపించిన అలవాటుగా మారుతోంది. రిజిస్టర్డ్ వినియోగదారులు , డిజిటల్ లావాదేవీల సంఖ్యలో సానుకూల వృద్ధి కనిపిస్తోంది. దేశంలోని 726 జిల్లాల్లో 722 జిల్లాలు ఈ నాలుగో త్రైమాసికంలో వృద్దిని సాధించాయి.

ఏడాదికేడాది త్రైమాసిక పరంగా భౌగోళిక పరంగా, అగ్రశ్రేణి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా గోవా (71%), అండమాన్ (41%), అసోం (37%) నిలుస్తున్నాయి. 27% వృద్ధిని నమోదు చేసుకున్న మహారాష్ట్ర త్రైమాసికంలో(1.01 బిలియన్ లావాదేవీలు) బిలియన్ లావాదేవీలు దాటిన తొలి రాష్ట్రంగా నిలుస్తోంది. దానికి గట్టి పోటీ ఇచ్చిన కర్ణాటక 24% త్రైమాసిక వృద్దితో 932 మిలియన్ లావాదేవీలను నమోదు చేసుకుంది.
2021 నాలుగో త్రైమాసికానికి సంబంధించిన Pulse నివేదికల్లోని సారాంశాన్ని విడుదల చేసిన సందర్భంగా, PhonePe వ్యూహ, మదుపుదారు సంబంధాల విభాగాధిపతి కార్తిక్ రఘుపతి మాట్లాడుతూ, “మా మూడో త్రైమాసిక నివేదికలో
పేర్కొన్నట్టుగా, హాలిడే సీజన్, పండుగ సీజన్, అనేక రకాల ఈ-కామర్స్ షాపింగ్ సేల్ లతో కలసి మర్చంట్ లావాదేవీలు గొప్ప త్రైమాసిక వృద్దిని నమోదు చేశాయి. Pulse నుండి సేకరించిన డేటా, అంతర్ దృష్టిని బట్టి చూస్తే, కాంటాక్ట్ లెస్ పేమెంట్ల వైపునకు వినియోగదారుల ప్రవర్తన మారుతుండడం కొనసాగుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

కస్టమర్లు, మర్చంట్లు ఇద్దరికీ డిజిటల్ పేమెంట్ల అలవాటు అనివార్యమైనవిగా మారడంతో 2022 మొదటి త్రైమాసికంలో కూడా ఈ పరిమాణంలో పెరుగుదల కనిపిస్తుందని ఎదురుచూస్తున్నాము. వచ్చే త్రైమాసికంలో ఎలాంటి ఆసక్తికరమైన
అంతర్ దృష్టి, ధోరణులు ఆవిష్కరించబడుతాయనే విషయాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నాము..”సెప్టెంబర్ 2021లో ఆవిష్కరించిన, PhonePe Pulse అనేది దేశంలోని డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన డేటా,అంతర్ దృష్టులు, ధోరణులతో కూడిన భారతదేశపు మొట్టమొదటి ఇంటరాక్టివ్ వెబ్ సైట్. PhonePe Pulse వెబ్ సైట్
భారతదేశపు ఇంటరాక్టివ్ మ్యాప్ లో వినియోగదారులు జరిపిన 2000 కోట్లకు పైగా లావాదేవీలను చూపిస్తుంది. మరిన్ని వివరాలు, ఆసక్తికరమైన అంశాలను pulse. phonepe.comలో చూడవచ్చు.

PhonePe పరిచయం:భారతదేశంలో 350 మిలియన్లకు పైగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులతో అగ్రగామి ఫిన్ టెక్ వేదికగా PhonePe నిలుస్తోంది. PhonePe ద్వారా, వినియోగదారులు డబ్బును పంపవచ్చు, అందుకోవచ్చు, అలాగే మొబైల్, DTH రీఛార్జ్చే యవచ్చు, దుకాణాలలో పేమెంట్లు చేయవచ్చు, వినియోగ పేమెంట్లు చేయడంతో పాటు బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చు.వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. 2017లో బంగారంను ఆవిష్కరించడం ద్వారా PhonePe ఆర్థిక
సేవలు ప్రారంభించింది, అలాగే బంగారం సేవలను అందిస్తూ వినియోగదారులు 24-క్యారెట్ల బంగారాన్ని సురక్షితంగా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది, ఆ తర్వాత పన్ను-ఆదా ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అంతర్జాతీయ ట్రావెల్ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, COVID-19 మహమ్మారి కోసం ఇన్సూరెన్స్ లాంటి వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్,

ఇన్సూరెన్స్ ఉత్పత్తులను PhonePe ప్రవేశపెట్టింది. అలాగే దేశవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా మర్చంట్ అవుట్‌లెట్‌లలో PhonePe అంగీకరించబడుతోంది.