Fri. Dec 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఫిబ్రవరి 8,2022: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సందర్శించారు. రామానుజాచార్యుల విగ్రహం దగ్గర టికెట్ కౌంటర్‌ను, థియేటర్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. బద్రవేదిలోని శ్రీరామానుజుల జీవితచరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. త్రీడీ లేజర్‌ షోను వీక్షించారు. 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు అమిత్‌ షా. ఆలయ విశేషాలను, సమతామూర్తి ప్రాంగణ విశేషాలను దగ్గరుండి వివరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.

రాత్రి యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువులో భాగంగా నిత్య పూర్ణాహుతిలో అమిత్‌ షా పాల్గొన్నారు . ప్రధాన యాగశాలలో పూజలు చేశారు. అమిత్‌షాను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ సన్మానించి మంగళాశాసనాలు అందించారు.

శ్రీరామనగరం పర్యటన కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా. భాగ్యనగరానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు . సమతామూర్తి దర్శనంతో ఆత్మానందం కలిగిందన్నారు. సమతామూర్తి విగ్రహం ప్రపంచానికి ఏకతా సందేశం ఇస్తోందన్నారు అమిత్‌ షా. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషిచేస్తోన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీని అభినందిస్తున్నానన్నారు అమిత్‌ షా. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చేపట్టిన ఈ కార్యక్రమం వేల ఏళ్లు నిలిచిపోతుందదన్నారు.రామానుజాచార్యుల బోధనలు అన్నివర్గాలకు ఆదర్శమన్నారు అమిత్‌ షా.రామానుజాచార్యులు మధ్యే మార్గంగా విశిష్టాద్వైతాన్నిసూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారన్నారు అమిత్‌ షా. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యులు బోధించారన్నారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అన్నారు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా.. దేశంలోని అన్నిభాషల్లో సమతామూర్తి సందేశాలను అందించాలన్నారు. రామానుజాచార్యులు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహ తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయన్నారు.

అటు అందరికీ ప్రేరణనిచ్చేలా అమిత్‌ షా ప్రసంగించారన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. సమతామూర్తి విగ్రహ ఏర్పాటులో మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు చేసిన కృషి అభినందనీయమన్నారు చిన్నజీయర్ స్వామీజీ.

సమతామూర్తి ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ముచ్చింతల్‌ రావడం గొప్ప విషయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధికి అమిత్ షా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ పాల్గొన్నారు.

రేపటి కార్యక్రమాలు:
యాగశాలలో ఐశ్వర్యప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి
సంతానప్రాప్తికై వైనతేయ ఇష్టి
…..
చిన్నారుల విద్యాభివృద్ధికి , పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ పూజ దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు
……………
ప్రవచనమండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు

error: Content is protected !!