Sat. Nov 23rd, 2024
Pitti Engineering vaccinated 7000 people across their manufacturing facilities in Hyderabad and Aurangabad

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, 24 జూన్‌ 2021: కోవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న దేశానికి మద్దతునందించడంతో పాటుగా ప్రజలు,తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను రక్షించడంలో భాగంగా పిట్టి ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వారం రోజులుగా నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌, ఔరంగాబాద్‌లలోని తమ తయారీ కేంద్రాలు, కార్పోరేట్‌ కార్యాలయాల వ్యాప్తంగా 7వేల మందికి టీకాలను అందించింది. ఈ కార్యక్రమం ద్వారా రెండు మోతాదుల టీకాలను పూర్తి ఉచితంగా ఉద్యోగులకు అందించనున్నారు.ఈ కార్యక్రమం కోసం పలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో కంపెనీ భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా రెండు కోట్ల రూపాయలను ఖర్చుచేసింది.ఈ కార్యక్రమం గురించి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌– వైస్‌ ఛైర్మన్‌ శ్రీ అక్షయ్‌ ఎస్‌ పిట్టి మాట్లాడుతూ ‘‘కార్యాలయాలు, తయారీకేంద్రాలలో ఉద్యోగులకు సురక్షిత వాతావరణం అందించాలనే ప్రభుత్వ మార్గదర్శకాలను మేము అనుసరిస్తున్నాము.

Pitti Engineering vaccinated 7000 people across their manufacturing facilities in Hyderabad and Aurangabad
Pitti Engineering vaccinated 7000 people across their manufacturing facilities in Hyderabad and Aurangabad

మా ఉద్యోగులతో పాటుగా 7వేల మంది ప్రజల టీకా ఖర్చులను భరించడమనేది కోవిడ్‌–19తో పోరాడుతున్న దేశానికి మా వంతు సహకారంగా భావిస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ టీకాలను వేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారిని జయించేందుకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం పిట్టి ఇంజినీరింగ్‌ పలు కార్యక్రమాలను చేపట్టింది. అత్యంత కఠినమైన భద్రతా మార్గదర్శకాలను ప్లాంట్‌లు, కార్యాలయాల వద్ద నిర్వహించడంతో పాటుగా పలు ఆన్‌లైన్‌ కార్యక్రమాల ద్వారా తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మానసిక సంక్షేమానికి భరోసా అందించేందుకు కృషి చేస్తుంది.

error: Content is protected !!