365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 26, 2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు వీరనారి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించబడింది. రాజేంద్రనగర్ లోని PJTAU పరిపాలనా భవనంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరిశోధనా సంచాలకుడు డాక్టర్ పి. రఘురామి రెడ్డి ఐలమ్మ చిత్రపటానికి పూలు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె పోరాటాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమెకు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది కూడా పాల్గొని వీరనారి ఐలమ్మకి ఘనంగా నివాళులు అర్పించారు.