365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 24,2023: ప్రధాని మోదీ యువత కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం ఉదయం ‘నో యువర్ లీడర్’ కార్యక్రమం కింద పలువురు యువతను కలుసుకుని వారి ప్రశ్నలకు సమాధాన మిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా యువత తరలివచ్చి, వివిధ నాయకులు మంత్రులతో సంభాషించారు. ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారాలతో సత్కరించిన11మంది పిల్లలను కూడా ప్రధాని మోదీ కలుసుకోనున్నారు.

ఇన్నోవేషన్, సామాజిక సేవ, అకడమిక్, స్పోర్ట్స్, ఆర్ట్-కల్చర్ , శౌర్య విభాగాల్లో అసాధారణ విజయాలు సాధించినందుకు ఈ పిల్లలు అన్ని రంగాల నుంచి ఎంపిక చేశారు.
గతేడాది 29 మంది చిన్నారులను ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారంతో సత్కరించారు. ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారంతో సత్కరించిన 11 మంది పిల్లలను కూడా ప్రధాని మోదీ ఈరోజు సమావేశం అవ్వనున్నారు.