Prime-Minister-Modi

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 4,2022:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నేవీ డే సందర్భంగా భారత నావికాదళాన్ని ప్రశంసించారు.

ఇది మన దేశాన్ని దృఢంగా రక్షించిందని సవాలు సమయాల్లో మానవతా స్ఫూర్తితో తనకంటూ ప్రత్యేకతను చాటుకుందని అన్నారు.

1971 ఇండో-పాక్ యుద్ధంలో ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో భారత నౌకాదళం పాత్రను గుర్తించి, సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి భారతదేశం డిసెంబర్ 4ని నేవీ డేగా జరుపుకుంటుంది.

”నేవీ సిబ్బందికి, వారి కుటుంబాలకు నేవీ డే శుభాకాంక్షలు. భారత్‌లో ఉన్న మేం గొప్ప సముద్ర చరిత్రకు గర్వపడుతున్నాం’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

”భారత నావికాదళం మన దేశాన్ని దృఢంగా పరిరక్షించింది. సవాళ్ల సమయంలో మానవతా స్ఫూర్తితో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.