వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ కు ఆయన శత జయంతి నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘టైంలెస్ లక్ష్మణ్’’ పేరు తో వచ్చిన పుస్తకాన్ని 2018వ సంవత్సతరం లో శ్రీ నరేంద్ర మోదీ తాను ఆవిష్కరించినప్పుడు చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భం లో పంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో..

‘‘ బహుముఖ ప్రతిభాశాలి ఆర్.కె. లక్ష్మణ్ ను ఆయన 100వ జయంతి నాడు స్మరించుకొంటున్నాను. వ్యంగ్యచిత్రాల ద్వారా, ఆయన నాటి సామాజిక, రాజకీయ వాస్త వాలను వ్యక్తం చేశారు. 2018వ సంవత్సరం లో ‘టైంలెస్ లక్ష్మణ్’ పేరు తో వచ్చిన పుస్తకాన్ని నేను ఆవిష్కరించినప్పుడు ఇచ్చిన ప్రసంగాన్ని ఇక్కడ పంచుకొంటున్నాను. https://t.co/S0srPeZ4hL ’’ అని పేర్కొన్నారు.