Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,మార్చి 31,2022: భారతదేశపు మూడో అతిపెద్ద ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO, నేడు X సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆల్ రౌండర్ POCO X4 ప్రో 5G విడుదల చేసింది. రాజీలేని స్మార్ట్ కంప్యూటింగ్ అనుభూతి కోరుకునే ఔత్సాహికుల కోసం ఈ తాజా స్మార్ట్‌ఫోన్ రూపొందించబడింది.POCO X సిరీస్‌లో 120Hz సూపర్ AMOLED స్క్రీన్‌తో 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌, 67W MMT సోనిక్ ఛార్జింగ్, 64MP కెమెరా, అద్భుతమైన డిజైన్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ POCO X4 Pro 5G.

విడుదల సందర్బంగా POCO ఇండియా కంట్రీ డైరెక్టర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ, “సెగ్మెంట్‌లో అత్యుత్తమ అనుభవాన్ని అందించడం ద్వారా కస్టమర్ల అంచనాలు అధిగమించేందుకు POCOలో మేము కృషి చేస్తాం. గత రెండు సంవత్సరాలుగా మేము మా X సిరీస్‌ ద్వారా ఈ సెగ్మెంట్‌లో ప్రభావవంతంగా నిలిచాం. POCO X4 ప్రో 5G లాంచ్‌తో మేము ఆ విజయగాథను పునరావృతం చేయడమే కాదు ఈ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పడంపై దృష్టి సారించాము” అన్నారు.“Packed in with prominent flagship-level features such as a 120Hz AMOLED display, 64MP camera and 67W MMT Sonic “120Hz AMOLED డిస్‌ప్లే, 64MP కెమెరా, 67W MMT సోనిక్ ఛార్జింగ్ వంటి ప్రముఖ ఫ్లాగ్‌షిప్-స్థాయి ఫీచర్లతో రూపొందిన POCO X4 Pro 5G- అద్భుతమైన విలువ, నాణ్యత, పనితీరు కోరుకునే ఔత్సాహికుల కోసం
రూపొందించబడింది” అని ఆయన అన్నారు.

కట్టిపడేసే డిస్‌ప్లే

స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే అన్నది అత్యంత కీలకమైనదని నిస్సందేహం గా చెప్పవచ్చు ఎందుకంటే యూజర్‌ ఉపయోగించే కంటెంట్‌కు అది ద్వారంగా నిలుస్తుంది. POCO X4 Pro 5Gని 6.67-అంగుళాల సూపర్ AMOLED ప్యానెల్‌తో 120Hz హై-రిఫ్రెష్ రేట్, గేమింగ్ వైపు దృష్టి సారిస్తూ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో క్లాస్-లీడింగ్ డిస్‌ప్లే టెక్నాలజీని POCO అందిస్తోంది. ఇది ఫోన్ రోజువారీ పనితీరును సహజంగానే ఎంతో సులభతరంచేస్తుంది. ఎండలో ఉండి కూడా వీడియోలు చూడవచ్చు, ఎలాంటి కంటెంట్‌ చదవవచ్చు. ఎందుకంటే దీనికి ఉంది 1200 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌.

ఆకట్టుకునే కెమెరాలు

వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా, ఫ్రంట్‌ భాగంలో 16MP సెల్ఫీ కెమెరాతో POCO X4 Pro 5Gలో ఇమేజింగ్ అనుభవం అనిర్వచనీయంగా ఉంటుంది. 64-MP ప్రైమరీ సెన్సార్ భారీ రిజల్యూషన్, గొప్ప కాంతి-సేకరణ ప్రక్రియను అందిస్తుంది, ఇది తక్కువ-కాంతి ఉన్నా ఉజ్వలంగా నిలుస్తూ వాస్తవ దృశ్యాన్ని సహజంగా కనిపించేలా చేస్తుంది. స్టెర్లింగ్ 8-MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ల్యాండ్‌స్కేప్‌ ఫొటోలు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే మీరు సబ్జెక్ట్‌తో సన్నిహితంగా, వ్యక్తిగతంగా ఉండాలనుకున్నప్పు డు దీని 2-MP మాక్రో లెన్స్ ఫ్రేమ్‌లోని అతి చిన్న సూక్ష్మ విషయాలు వెలికి తీయు డంలో సాయపడుతుంది.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్

భారీ 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది POCO X4 Pro 5G. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక రోజు కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఒక వేళ అది కరిగిపోతే వెంటనే రీఛార్జ్ చేసేందుకు 67W MMT సోనిక్ ఛార్జింగ్‌ మీకు ఉండనే ఉంది. ఇది కేవలం 15 నిమిషాల్లో ఫోన్‌ను 50%కి టాప్ అప్ చేస్తుంది. MMT స్ప్లిట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే బ్యాటరీ సురక్షితంగా ఉంటుంది, ఎప్పుడూ వేడెక్కదు. ఇవన్నీ కలిపి కూడా ఈ ఫోన్ బరువు 205 గ్రాముల కంటే తక్కువే. POCO X-సిరీస్‌లో ఇది అత్యంత స్లిమెస్ట్ ఫోన్‌.

11 వరకు మారిన గేమింగ్ క్రెడెన్షియల్స్‌

X-సిరీస్‌లో అత్యాధునికమైన 6nm సిస్టమ్-ఆన్-ఎ-చిప్, క్వాల్‌కామ్‌® స్నాప్‌డ్రాగన్‌ ® 695 ఫీచర్‌ను కలిగి ఉన్న మొదటి ఫోన్ ఇది. ఇది 2.2GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో పాటు వేగవంతమైన UFS 2.2 స్టోరేజ్ (128GBవరకు) 8GB LPDDR4X RAMతో కలిసి ఉంటుంది. వీటి కారణంగా గేమింగ్ కోసం సుస్థిరమైన పనితీరు ఉంటుంది, అలాగే అతి తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది.7 5G బ్యాండ్స్‌తో ఇంటిగ్రేటెడ్ 5G మోడెమ్‌తో కూడా వస్తుంది. భవిష్యత్తుకు సిద్ధంగా నిలుస్తూ ఫిఫ్త్‌ జనరేషన్‌ నెట్‌వర్క్‌ కోసం భారతీయ మార్కెట్‌కు తగినది. మైక్కో SD కార్డు ద్వారా దీని మెమరీని 1 TB వరకు
పెంచుకునేందుకు సపోర్టు చేస్తుంది.

సన్నగా ఉంటుంది కానీ ప్రో

డిజైన్‌పరంగా POCO X4 Pro 5Gని సన్నగా నిలిపేందుకు POCO ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. POCO X- సిరీస్ చాలా సన్నగా ఉంటుంది, దీని బరువు కేవలం 205 గ్రాములే. గ్లాస్ బ్యాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 5G ​​సామర్థ్యం, 67W MMT సోనిక్ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 5000 mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియం మెటీరియల్‌
కలబోత ఇది.

error: Content is protected !!