Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 15, 2023: ప్రభుత్వం అధికారికంగా పొలాల అమావాస్య పండగను నిర్వహించాలని తెలంగాణ మున్నూరుకాపు ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు బాల శ్రీనివాస్ పటేల్ కోరారు.

ట్యాంక్ బండ్ వద్ద గురువారం మున్నూరు కాపు ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (టీఎమ్ కే ఈ డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో పొలాల అమావాస్య, బొడ్డెమ్మ పండగవేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎద్దులను అందంగా అలంకరించి పూజలు నిర్వహించి ట్యాంక్ బండ్ పై ఊరేగించారు.

“తెలంగాణలో వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తున్న మున్నూరుకాపులు పొలాల అమావాస్య, బొడ్డెమ్మ సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని” తెలంగాణ మున్నూరుకాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాల శ్రీనివాస్ పటేల్ తెలిపారు.

తెలంగాణాలో వ్యవసాయదారులు పంటను పండించడానికి సహాయపడే ఎడ్లను పూజించి గౌరవించే గొప్ప సాంప్రదాయ పండుగ ఎడ్ల పొలాలామాస..అని వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే మున్నూరుకాపుల ప్రధాన పండుగ ఎడ్ల పొలాలమాస.

ఎడ్లను పూజిద్దాం వ్యవసాయాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ఎడ్ల పొలాలమాస పండుగను జరుపుకొంటూ భవిష్యత్ తరాలకు వ్యవసాయ ప్రాముఖ్యతను తెలుపుదామని ఆయన అన్నారు.

ఈ వేడుకలను వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగానూ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతోపాటు సంఘం నేతలు పురుషోత్తం, మహంతి వెంకట్రావు, ఏనుగుల సత్య నారాయణ పటేల్, రాజు, శ్రవణ్, రాజేశ్, నేతి మంగమ్మ, రజిత తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!