


పవన్ కళ్యాణ్ పుట్టుకతో హిందువు. హిందూ సనాతన వైదిక ధర్మం నాగరికత, సంస్కృతి గురించి తెలిసిన వారు. సంస్కారం తెలిసిన వారు. ఒక రకంగా అపర మేధావి అనకపోయినా మేధావి , యోగి కోవకు చెందిన వారు. (సంసారం జీవితం అనుభవించిన మానవ జీవి) పరిపూర్ణ యోగి ఔతారు. ఉదాహరణకు: అన్న మాచార్యులు కోవకు చెందిన వారే. పవన్ కళ్యాణ్. (అన్నమాచార్యులు తో పోల్చడం తప్పు అయితే నన్ను క్షమించండి) పరిపూర్ణ యోగిగా మారాలంటే సంసార జీవితం అనుభవించాలి… అప్పుడే వారి లో ఉన్న కోరికలు, స్వార్దం తగ్గి మనస్సు కూడా పరిపూర్ణంగా సేవ చేసే పనిలో నిమగ్నమౌతారు. ఇది అందరికీ సాధ్యపడదు. నూటికో కోటికో ఎక్కడో ఉంటారు మహానుభావులు కొందరు… ఇప్పటి వారిలో మోడీజీ , యోగి ఆద్యనాథ్, పవన్ కళ్యాణ్ లాంటి వారు. నాకు తెలియని ఇంకా కొందరు వుండవచ్చు.

సహజంగా ఇలాంటి వారికి డబ్బు మీద వ్యామోహం ఉండదు. వీరి వెనుక వచ్చే తరాలకు డబ్బును దాచిపెట్టాలనేతత్వం అస్సలు ఉండదు. చంద్ర బాబు నాయుడులాగానో, జగన్ రెడ్డి లాగానో తోడు దొంగలు జాబితాలో పవన్ సభ్యులు మాత్రం కాదు. మోడీజీ గాని, యోగిఆదిత్య నాథ్ కి గాని, పవన్ కళ్యాణ్ కు గాని డబ్బు కూడ బెట్టాలనే ఆశ , స్వార్దం ఉండదు. పవన్ కళ్యాణ్ ఈమధ్య రెండు, మూడు సార్లు బైబిల్ లోని కోటేషన్స్ ను ఉదహరించారు. దీనిలో తప్పు పట్టాల్సిన పనిలేదు. నిపున్ శర్మ ఖురాన్ లోని సూక్తులు తీసుకొని అందులో నీ తప్పులు ఎత్తి చూపడం వల్లే కదా ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఖురాన్ లోని తప్పిదాలు తెలిసి వాటిని అడగటం వల్లే సంచలనంగా మారింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ బైబుల్ లోని కొటేషన్స్ “తగ్గింపువాడు హెచ్చింప బడును” అని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కొందరు తప్పు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ భార్యలలో ఒకరు రష్యా కు చెందిన వారు. ఆమె స్వతహాగా క్రిస్టియన్. పవన్ కళ్యాణ్ అపుడప్పుడు చర్చ్ కి వెళ్లుతుండవచ్చు. ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నదని అందరికీ తెలుసు.

బహుశా బైబిల్ చదివి పూర్తి అవగాహన కలిగి ఉండవచ్చు.. ఖురాన్ చదివిన నిపున్ శర్మ లాగా..అందువల్లే పవన్ కళ్యాణ్ బైబుల్ లోని కొటేషన్స్ ను చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి లకు అర్థమయ్యే రీతిలో బైబుల్ సూక్తులను సందించల్సిన పరిస్థితి వచ్చిందని భావించాల్సి ఉంటుంది. నీపున్ శర్మ లాగా…త పరంగా పవన్ కళ్యాణ్ హిందువే. తాను హిందువుని అని ఎన్నో సార్లు ఆయనే స్వయంగా చెప్పారు. హిందూ సనాతన వైదిక ధర్మం పాటిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు కూడా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను తప్పుపట్టాల్సిన పనిలేదు.

Disclaimer: “మేడిశెట్టి కాలమ్” లో అభిప్రాయాలూ, విశ్లేషణ పొలిటినిక్ అనలిస్ట్ వ్యక్తిగతం..365telugu.com కు సంబంధం లేదు..