Fri. Nov 22nd, 2024
jupally_ponguleti_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏప్రిల్ 10,2023: కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ పై పొంగులేటి, జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘రాత్రంతా చెప్పినా తెలంగాణ ప్రజల గోడు తీరదని, ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చావని, తెలంగాణ వస్తే కావలి కుక్కలా ఉంటానని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అప్పుల తెలంగాణని చేసారని విమర్శించారు. ఐతే కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.

ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో పొంగులేటి అభిమానులు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని సుమారు 5 వేల కోట్ల రూపాయల అప్పులపాలు చేసిన నువ్వు మూడోసారి ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్నావు అది సాధ్యం కాదు అని గుర్తుపెట్టుకోవాలన్నారు.

jupally_ponguleti_365

కొత్తగూడెం వేదికగా అసలు ఉద్యమం ఇప్పుడే మొదలైందని, పోరాడి సాధించుకున్న తెలంగాణను అప్పుల తెలంగాణ గా మార్చిన కేసీఆర్ కు త్వరలోనే రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు.

కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణను తాకట్టు పట్టారని రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ కు వ్యతిరేకత మొదలైందని అర్థమై భారత రాష్ట్ర సమితిని స్థాపించి దేశ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరాడని అన్నారు.

ప్రజల కోసం కాకుండా కుటుంబం కోసం తెలంగాణను తాకట్టు పెట్టావు కదా కేసీఆర్ అందుకే నిన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలా అని ప్రశ్నించారు. 8సంవత్సరాల పాలనలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి సాధించింది ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమరులకు 10 లక్షల రూపాయలు ఇంటికో ఉద్యోగం అన్నావు ఎంతమందికి ఇచ్చావు.

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితబంధు పేరిట దళితులను మోసం చేస్తున్నావన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి అన్నావు ఎంతమందికి ఇచ్చావని నేను ప్రశ్నిస్తున్న నీ దగ్గర సమాధానం ఉందా కేసీఆర్,మీ పతనానికి రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తుంది కొత్తగూడెం వేదికగా తిరుగుబాటు మొదలైందని హెచ్చరించారు.

అంతకు ముందు జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోదని భారత రాష్ట్ర సమితి పేరుతో దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరారని అన్నారు. పొంగులేటి వెంట రావడానికి సిద్ధపడ్డ సర్పంచులను ప్రజా ప్రతినిధులను నిధులు ఇచ్చేది లేదని బెదిరింపులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు.

jupally_ponguleti_365

కేసిఆర్ పాలనలో ప్రజాస్వామ్యం అణచి వేయబడుతుందని అందుకే పొంగులేటితో కలిసి నడుస్తున్నాను అని జూపల్లి అన్నారు. తెలంగాణను దోచుకుంటున్న దుర్మార్గుడు కేసీఆర్ అని కొత్తగూడెం వేదికగా ఆయన పతనం మొదలైందని అన్నారు.

తెలంగాణ సాధన కోసం పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రగతి భవన్ తలుపులు ఎందుకు తెరచుకోవని ప్రశ్నించారు. 12వేల గ్రామపంచాయతీలను మోసం చేసిన ఘనత కేసిఆర్ దేనని అన్నారు. 17 లక్షల మందికి దళితబంధు ఇస్తానని చెప్పిన ఇంతవరకు ఎంతమందికి దళిత బంధు ఇచ్చావని సూటి ప్రశ్న సంధించారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం వేదికగా రాష్ట్ర మొత్తం ఖమ్మం వైపు చూస్తుందని రానున్న ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో ఖమ్మం జిల్లా పదికి పది స్థానాలు సాధించి కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలని జిల్లా ప్రజలకు జూపల్లి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య, జారే ఆదినారాయణ, మువ్వా విజయ్ బాబు, జడ్పిఛైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

error: Content is protected !!