365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం, ఏప్రిల్ 8,2023: గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఇన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠ వీడనుంది. తాను చేరే పార్టీపై ఆయన క్లూ ఇచ్చారు.
శనివారం ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగిలేటి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా జాతీయ పార్టీలోనే చేరుతానని ఈ నెలాఖరులోగా ఆ పార్టీ ఏంటో వెల్లడిస్తానని ఆయన అన్నారు.
కెసిఆర్ మాయ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని రెండుసార్లు నమ్మి మోసపోయారని, మరలా ఇప్పుడు ప్రజలను పట్టుకుని తిరుగుతున్నారని ఈ సారి కెసిఆర్ ను గద్దె దించడం ఖాయమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆకాంక్షల నెరవేరుతుందనుకున్న తరుణంలో ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం జరిగిందని పొంగులేటి విమర్శించారు.
మధిరలో మున్సిపాలిటీ పరిధిలోని దిడుగుపాడు సాయి నగర్ లో పొంగులేటి క్యాంప్ ఆఫీసును ఓపెన్ చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఈదురు గాలులకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున కెసిఆర్ నష్టపరిహారం అందిస్తానని చెప్పి ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని తెలిపారు.
అంతేకాకుండా రైతులకు రుణమాఫీ అమలు చేయలేదని ఈ పథకం ఊసే లేదన్నారు. డాక్టర్ కోట రాంబాబు మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస్ రెడ్డి లాంటి మనసున్న నాయకుడిని ప్రజల కోరుకుంటున్నారని అన్నారు.
మండల తిరుమలరావు మాట్లాడుతూ పొంగులేటి విమర్శించే జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుది మధిరలో మూడో స్థానమేనని, వచ్చే ఎన్నికల్లో మధిర అసెంబ్లీ స్థానాన్ని శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిని గెలిపించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు. బోనకాలు లో పొంగులేటి క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు యన్నం కోటేశ్వరరావు, దేవి శెట్టి రంగారావు, ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, ఎర్రుపాలెం జడ్పిటిసి శీలం కవిత, ఎంపీటీసీ శీలం విజయలక్ష్మి, మాజీ జెడ్పిటిసి అంకసాల శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి సామునూరు కృష్ణార్జున, త్రివేణి,మాజీ ఎంపిటిసి శీలం అక్కమ్మ, లక్కిరెడ్డి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.