bcm_ponguleti

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 3: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు.

పర్యటనలో భాగంగా వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని గ్రామాలను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తో కలిసి సందర్శించారు.

ఆయా గ్రామాల్లో ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

bcm_ponguleti

అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అధైర్యపడొద్దు అండగా ఉంటానని భాదితులకు పొంగులేటి భరోసా ఇచ్చారు.

ఇటీవల పెళ్ళైన నూతన జంటలను ఆశీర్వదించి, పట్టువస్త్రాలను కానుకగా అందించారు. అనంతరం పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరియ్ బ్రహ్మయ్య, జడ్పి ఛైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.