Sun. Sep 8th, 2024
Anchor_suma

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 13,2023: యాంకర్ సుమ అరెస్టా..? ఏ కేసులో అనే డౌట్ చాలా కామన్ గా వస్తుంది. నిజానికి ఆమె ను అరెస్ట్ చేయలేదు అసలు కథ ఏంటంటే..? సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు.

కేవలం కంటెంట్ మాత్రమే కాదు, ఆశించిన ఫలితాన్ని పొందాలంటే సినిమాను బాగా ప్రమోట్ చేసేలా మేకర్స్ కూడా చూసుకోవాలి. ప్రమోషన్స్ లేకపోవడంతో మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి. అల్లరి నరేష్ ఉగ్రమ్ టీమ్ ఈ అంశాన్ని బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Anchor_suma

యాంకర్ సుమ చేతికి సంకెళ్లు వేసి కారుకు కట్టేసి ఉన్న చిత్రాన్ని ఉగ్రమ్ టీమ్ ఈరోజు విడుదల చేశారు. “ప్రముఖ యాంకర్ సుమ అరెస్ట్, త్వరలో వివరాలు (Popular Anchor Suma arrested. Details awaited)” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోమోను విడుదల చేశారు, ఇందులో సుమ అల్లరి నరేష్‌ను ఎందుకు అరెస్టు చేశారని అడుగుతున్నట్లు కనిపిస్తుంది.

పూర్తి వీడియో రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది. నాంది తర్వాత, నరేష్, విజయ్ కనకమేడల ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. మిర్నా కథానాయికగా నటిస్తుంది. ఉగ్రమ్ 5 మే 2023న విడుదల అవుతుంది.

error: Content is protected !!