365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 25,2024: టెలికాం సేవా సంస్థలు సేవలను అందించడంలో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించాయి.ఈ సమాచారాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలను అమలు చేస్తూ, కమర్షియల్ మెసేజ్‌లను ఎవరు పంపుతున్నారో తెలుసుకునే వ్యవస్థను రూపొందించడంతో ఇలాంటి నోటిఫికేషన్ వెలువడింది.
సందేశాలను పంపే కంపెనీలు తప్పనిసరిగా తమ URL (యూనిఫాం రిసోర్స్ లొకేటర్) కాల్‌బ్యాక్ నంబర్‌ను టెలికాం ఆపరేటర్‌లకు అందించాలి. ఈ సమాచారాన్ని టెలికాం ఆపరేటర్ బ్లాక్‌చెయిన్ ఆధారిత పంపిణీ లెడ్జర్ ప్లాట్‌ఫారమ్‌లో సేకరించడం జరుగుతుంది.
సందేశాలను పంపేటప్పుడు అందించిన సమాచారం బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లోని సమాచారంతో సరిపోలినప్పుడు మాత్రమే వినియోగదారులకు సందేశాలు పంపిణీ చేస్తాయి. TRAI ఆదేశాల మేరకు అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలిమార్కెటింగ్ కంపెనీలు,ఈ-కామర్స్ సంస్థలు సాంకేతిక నియంత్రణను ఇంకా అమలు చేయలేదని టెలికాం సేవా సంస్థలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సర్దుబాటు గడువును రెండు నెలలు పొడిగించాలని కూడా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.