Post the grand success of offline edition, PropTiger launches online version of its “Right to Home 2021 expo”Post the grand success of offline edition, PropTiger launches online version of its “Right to Home 2021 expo”

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, 04 మార్చి 2021 ః  ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ సంస్ధ ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ తమ రైట్‌ టు హోమ్‌ 2021 ఎక్స్‌పో ఆన్‌లైన్‌ వెర్షన్‌ను 18 –19మార్చి 2021 తేదీలలో నిర్వహించబోతుంది.ఎలారా టెక్నాలజీస్‌ నిర్వహించబోతున్న ఈ ఆన్‌లైన్‌ ఎక్స్‌పోలో  అదానీ, గోద్రేజ్‌, షాపూర్జీ పల్లోంజీ,  సిగ్నేచర్‌,  వాధ్వా, టీవీఎస్‌,కల్పతరు వంటి 70 మందికి పైగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు మొత్తంమ్మీద 19వేల గృహ యూనిట్లను విభిన్నమైన ధరల విభాగం వద్ద ప్రదర్శించనున్నారు. ప్రధానంగా ఈ యూనిట్‌లు 45 లక్షల రూపాయల నుంచి 4.5 కోట్ల రూపాయల శ్రేణిలో ఉంటాయి.‘‘ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన రైట్‌ టు హోమ్‌ ఎక్స్‌పో రెండవ ఎడిషన్‌ ఆఫ్‌లైన్‌ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయం అందించిన ప్రోత్సాహంతో తామిప్పుడు ఈ ఆన్‌లైన్‌ ఎడిషన్‌తో వచ్చామ’’ని ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ బిజినెస్‌ హెడ్‌ రాజన్‌  సూద్‌ అన్నారు. ఈ ఎక్స్‌పో ద్వారా దాదాపు 2 మిలియన్ల మందిని తాము చేరుకోగలమని భావిస్తున్నట్లు ఆయన వెల్లడిస్తూ ఈ వర్ట్యువల్‌ కార్యక్రమం అందించే ప్రయోజనాలను స్వీకరించేందుకు సంభావ్య కొనుగోలుదారులు,  మదుపరులను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎక్స్‌పో ద్వారా అత్యుత్తమ రాయితీలను సైతం కొనుగోలుదారులు పొందవచ్చు అని అన్నారు.ఈ ఎక్స్‌పోలో భాగంగా ఎంపిక చేసిన రెరా ప్రాజెక్టుల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేకమైన చెల్లింపు ప్రణాళికలు,జీఎస్‌టీ,స్టాంప్ డ్యూటీ రద్దు,బుకింగ్స్‌పై బంగారు నాణెములను పొందడం వంటి అవకాశాలూ ఉన్నాయి.

Post the grand success of offline edition, PropTiger launches online version of its “Right to Home 2021 expo”
Post the grand success of offline edition, PropTiger launches online version of its “Right to Home 2021 expo”