Rajasaab : రాజా సాబ్ సినిమా బాక్సాఫీస్ జోరు.. ప్రభాస్ మరో రికార్డు..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 11,2026: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రభాస్ క్రేజ్‌తో భారీ వసూళ్లను రాబడుతోంది.

తొలిరోజే ..

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం రూ. 100 కోట్ల (Gross) మార్కును దాటి రికార్డు సృష్టించింది. దీనితో కెరీర్‌లో ఆరుసార్లు వంద కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఏకైక భారతీయ హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర లిఖించారు.

భారతదేశంలో మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 54.15 కోట్ల (Net) వసూళ్లను సాధించగా, అందులో తెలుగు రాష్ట్రాల వాటానే అత్యధికంగా (సుమారు రూ. 47 కోట్లు) ఉంది.

రెండో రోజు..

అయితే, సినిమాకు వస్తున్న టాక్ ప్రభావం రెండో రోజు వసూళ్లపై కొంత కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, రెండో రోజు (శనివారం) కలెక్షన్లలో సుమారు 50-60 శాతం తగ్గుదల నమోదైంది.

రెండో రోజు భారత్‌లో దాదాపు రూ. 26-28 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా. రెండు రోజులు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా నెట్ కలెక్షన్లు రూ. 90 కోట్ల మార్కును చేరగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు రూ. 138 కోట్ల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది.

Read this also..IND vs NZ: Focus on New-Look Middle Order as India Face Kiwis Today..

ఇదీ చదవండి..పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సింధూరి చిత్రం..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి సంక్రాంతి సెలవులు పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి. సినిమా బడ్జెట్ భారీగా ఉన్న నేపథ్యంలో, లాంగ్ వీకెండ్, పండగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఏ మేరకు థియేటర్లకు వస్తారనే దానిపైనే ఈ ‘రాజా’ విజయం ఆధారపడి ఉంది.