
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, జనవరి 18, 2022: తిరుమలలో ప్రణయ కలహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలోభాగంగా స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయంవద్ద కలిశారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతించారు.

ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.