Fri. Jan 3rd, 2025
srisailamTemple_365t

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,ఫిబ్రవరి 2,2023:శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు దేవస్దానం ప్రతినిధులు ఆహ్వానం అందించారు.

ఇల కైలాసంగా ప్రసిద్దినొంది, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి, అష్టాదశ మహాశక్తి స్వరూపాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి వారికి నిలయమైన ఈ దివ్య క్షేత్రంలో ఈనెల 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వహణ అధికారి లవన్న గవర్నర్ కు వివరించారు.

18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం , పాగాలంకరణ, కళ్యాణ మహోత్సవం ఉంటాయని కుటుంబ సమేతంగా వేడుకకు హాజరు కావాలని విన్నవించారు.

19వ తేదీన స్వామివారి రధోత్సవం, తప్పోత్సవం నిర్వహిస్తామని, పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామని గవర్నర్ హరిచందన్ కు తెలిపారు.

srisailamTemple_365t
error: Content is protected !!