PM Narendra modiPM Narendra modi
PM narendra modi

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 30,2022:ఈ రోజు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. అమరవీరుల దినం సందర్భంగా ప్రధానమంత్రి, దేశ రక్షణకు అసమాన ధైర్యసాహసాలతో పాటుపడుతూ అమరులైన వారందరికీ నివాళులర్పించారు.

PM Narendra modi
PM Narendra modi

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సందేశం ఇస్తూ… బాపూజీని వారి పుణ్యతిథి సందర్భంగా సంస్మరించుకుంటున్నాను.వారి మహోన్నత ఆశయాలను మనందరి సమష్ఠి క్రుషితో మరింత ప్రచారంలోకి తీసుకురావాలి. అలాగే ఈరోజు అమరవీరుల దినం.దేశ రక్షణకు అసమాన ధైర్యసాహసాలతో పాటుపడి అమరులైన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. వారి సేవలు, వారి ధైర్యసాహసాలు ఎల్ల వేళలా స్మరించుకుంటాము అని ప్రధానమంత్రి తమ సందేశంలో తెలిపారు.

***