365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 24,2023: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పిఎమ్ఆర్ బిపి) విజేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు తన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో సమావేశం కానున్నారు.
భారతదేశం ప్రభుత్వం బాలలకు వారి అసాధారణమైన కార్యసాధన కు గాను ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల’ ను అందిస్తుంది. వీటిని ఆరు కేటగిరీల లో ప్రదానం చేస్తున్నది.
నూతన ఆవిష్కరణ, సామాజిక సేవ, విద్య సంబంధి, క్రీడలు, కళ , సంస్కృతి, సాహసం వంటి ఆరు కేటగిరీ లు ఉన్నాయి. ప్రతి ఒక్క పురస్కార విజేతకు ఒక పతకాన్ని, ఒక లక్ష రూపాయల నగదు బహుమతి,ఒక ధ్రువపత్రాన్ని అందజేస్తారు.

ఈ సంవత్సరం పిఎమ్ఆర్ బిపి-2023 కోసం, దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి11మంది పిల్లలను వివిధ కేటగిరీలలో బాలశక్తి పురస్కారాలకు ఎంపిక చేశారు.
పదకొండు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరుగురు బాలురు,ఐదుగురు బాలికలు పురస్కారాలను అందుకున్నారు.