
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 28,ఇండియా,2022:ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ డిజిటల్ విడుదల తేదీని ప్రైమ్ వీడియో ఈ రోజు ప్రకటించింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ నిర్మించాయి. ఈ ప్రేమకథా చిత్రంలో పూజా హెగ్డే, భాగ్యశ్రీ, సచిన్ ఖేడేకర్, కునాల్ రాయ్ కపూర్ కూడా నటించారు.జీవితానికి సంబంధించి భిన్న దృక్పథం కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఇది. విక్రమాదిత్య (ప్రభాస్) విధి, అదృష్టాన్ని నమ్మే వ్యక్తి. సైన్స్ శక్తిని అపారంగా విశ్వసించే ప్రేరణతో (పూజా హెగ్డే) ప్రేమలో పడిపోతాడు.
ఏప్రిల్ 1, 2022 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రాధే శ్యామ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.“హద్దులు లేని ఈ కొత్త సినియుగంలో అద్భుతంగా ప్రతిధ్వనించే చిత్రం రాధే శ్యామ్” అన్నారునటుడు ప్రభాస్.“దార్శనిక దర్శకుడు రాధాకృష్ణ, పూజా హెగ్డే సహ మా బృందమంతా తమ మనస్సులన్నీ పెట్టి ప్రతీ ఒక్కరూ ఆనదించేలా ఈ ఉద్వేగభరితమైన ప్రేమను సృష్టించారు. డిజిటల్ విడుదలతో ఈ కథను మీ ఇళ్లలోకి తీసుకువస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరి ఆదరణ పొందాలని నేను ఆశిస్తున్నాను” అన్నారు.

Trailer:https://amazonprimevideo.box.com/s/8lj8a2nriaqhwc55990dz46jdgeipfdn