365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 11, 2025:సిలికాన్ వ్యాలీ ఆంత్రప్రెన్యూయర్ అరుణ్ పాల్ స్థాపించిన ప్రియా లివింగ్ భారతదేశంలో అడుగుపెట్టింది. వృద్ధాప్యం కోసం ధైర్యంతో కూడిన కొత్త దృక్పథాన్ని తీసుకువస్తోంది – ఇక్కడ వృద్ధాప్యం తిరోగమన సమయం కాదు, అన్వేషణ, ఆనందం, లక్ష్యం నెరవేర్చుకునే సమయం.

హైదరాబాద్‌లో ఆవిష్కరించిన ప్రియా లివింగ్ డైనమిక్ కమ్యూనిటీలు రాబోయే కాలాన్ని అవకాశం, అను సంధానం, జీవితకాల వృద్ధి దశగా మారుస్తాయి.


“ప్రియా లివింగ్ నాకు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైంది” అని ప్రియా లివింగ్ వ్యవస్థాపకులు అరుణ్ పాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఇది నా తల్లిదండ్రుల గురించి మాత్రమే కాదు, దశాబ్దాల క్రితం భారతదేశాన్ని విడిచిపెట్టి, దానిని వారి హృదయాలలో పెనవేసుకున్న లక్షలాది మంది ‘ఆంటీలు ,అంకుల్స్’ గురించి.

Read this also… Berger Paints Marks 100 Years with New Headquarters in Kolkata

Read this also… Aishwarya Rajesh Inaugurates ‘Kolors Healthcare 2.0’ in Hyderabad

వారి త్యాగాలు, పరిస్థితులను తట్టుకునే శక్తి, మాతృభూమి పట్ల వారికి గల శాశ్వతమైన ప్రేమ నన్ను ప్రియా లివింగ్‌ను సృష్టించడానికి ప్రేరేపించాయి. ఇది వారు శారీరకంగా మాత్రమే కాకుండా, భావోద్వేగపరంగా కూడా తిరిగి రాగల ప్రదేశం. వారు జీవించాలనుకునే విధంగా రూపొందించిన జీవనశైలితో వారిని స్వాగతించే ఇల్లు’’ అని అన్నారు.


ప్రియా లివింగ్ అనేది నివాసానికి మించింది. వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించటానికి చేపట్టిన ఒక ఉద్యమం. దీని కమ్యూనిటీలు శక్తివంతమైన, తరతరాలపాటు నిలిచి ఉండే కేంద్రాలు. ఇక్కడ వృద్ధులు తమ పాత అభిరుచు లను తిరిగి ప్రారంభించవచ్చు, కొత్త ఆసక్తులను అన్వేషించవచ్చు. తమ ఆశయాలను నెరవేర్చుకోవచ్చు.

ఆహ్లా దాన్ని అందించే స్థలాలు, ప్రపంచ స్థాయి సేవలు, క్యూరేటెడ్ అనుభవాలతో, ప్రియా లివింగ్ అనేది తెలివి, తాజా దృక్పథాలను కలిసేలా చేస్తుంది. సంప్రదాయం ఆధునిక జీవనంతో సజావుగా మిళితం అయ్యే వాతావరణాన్ని పెంపొందిస్తుంది.


ప్రియా లివింగ్ భారతదేశం అంతటా విస్తరిస్తున్న కొద్దీ, ఇది వృద్ధుల జీవితం గురించి పాత భావనలను సవాలు చేస్తుంది. రాబోయే సంవత్సరాలు వేగాన్ని తగ్గించడం గురించి కాదు, జీవిత అవకాశాలను స్వీకరించడం గురించి అని రుజువు చేస్తుంది. వృద్ధాప్యం భవిష్యత్తు ఇక్కడ ఉంది. ఇది ఆనందం, సాహసం, కమ్యూనిటీతో నిండి ఉంది.

తరచుగా గణనీయమైన ముందస్తు చెల్లింపులు అవసరమయ్యే సంప్రదాయ సీనియర్ లివింగ్ నమూనాల మాదిరిగా కాకుండా, ప్రియా లివింగ్ సౌకర్యవంతమైన, పే-యాజ్-యు-గో విధానాన్ని అందిస్తుంది.

ఇక్కడి నివా సితులపై భారీస్థాయి ప్రారంభ రుసుముల భారం ఉండదు. దీని వలన మా కమ్యూనిటీలు సీనియర్ జనాభా లోని విస్తృత విభాగానికి మరింత అందుబాటులో ఉంటాయి.

ఈ విధానం వృద్ధులు సాధారణంగా ఇటువంటి పరి వర్తనలతో ముడిపడి ఉన్న ఆర్థిక ఒత్తిడి లేకుండా అధిక-నాణ్యత జీవన ఏర్పాట్లను ఆస్వాదించగలిగేలా చేస్తుంది.


సీనియర్ లివింగ్ కమ్యూనిటీలలో గణనీయమైన పెట్టుబడి
ప్రియా లివింగ్ భారతదేశం అంతటా అత్యాధునిక సీనియర్ లివింగ్ కమ్యూనిటీలను అభివృద్ధి చేయడానికి $100 మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉంది.

సుస్థిర వృద్ధిని, అత్యున్నత నాణ్యత గల సేవలను అందించడానికి ఈ మూలధనం కాలక్రమేణా వ్యూహాత్మకంగా వినియోగించబడుతుంది. దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 2023లో ప్రారంభించిన మా మొదటి కమ్యూనిటీ, ప్రియా లివింగ్ ఫ్లవర్ వ్యాలీ, సీనియర్ లివింగ్ కోసం కొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది.

ఇది కూడా చదవండి.. మహాకుంభ్ 2025 : మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు..

ఇది కూడా చదవండి..హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు – వారంలోనే పరిష్కార చర్యలు

ఈ విజయంపై ఆధారపడి, ఈ రోజు మేము హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో కొత్త కమ్యూనిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం చివర్లో వీటిని ప్రారంభించనున్నాం. 2026 చివరి నాటికి, భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో మా ఉనికిని ఏర్పరచేలా మేం ప్లాన్ చేస్తున్నాం.

ఇది వృద్ధులకు చురు కైన, సంతృప్తికరమైన జీవనశైలిని ప్రోత్సహించే శక్తివంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాలను అందిస్తుంది.