365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 16,2022: భారతదేశంలో సుప్రసిద్ధ ఇంటీరియర్ డిజైన్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్ ప్రోలాన్స్ నేడు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగర వ్యాప్తంగా గృహ ఇంటీరియర్ డిజైన్ లేదా గృహ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమైన మద్దతును స్ధానిక ఫ్యాబ్రికేషన్‌తో అందిస్తుంది. నేడు హైదరాబాద్‌లోని లీమెరిడియన్ హోటల్ లో జరిగిన ఆవిష్కరణలో నగరానికి చెందిన 100 మందికి పైగా ఇంటీరియర్ డిజైనర్లు పాల్గొన్నారు. ప్రోలాన్స్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు స్ధానిక ఇంటీరియర్ డిజైనర్లకు ప్రోలాన్స్ ప్లాట్‌ఫామ్ ,మార్కెట్ ప్రాంగణం గురించి అవగాహన కల్పించారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలలో సైతం హైదరాబాద్‌లోని తమ సెంట్రల్ హబ్ నుంచి గృహ యజమానులకు తగు రీతిలో సేవలనందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
క్లౌడ్ ఆధారిత ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్ ప్రోలాన్స్. ఇంటీరియర్ డిజైన్ ఖర్చును 20%కు పైగా తగ్గిస్తామనే వాగ్ధానాన్ని ఇది చేస్తుంది,నిర్ధేశించిన సయమానికి 40% ముందుగానే దీని ద్వారా ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చు. ఇంటీరియర్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన మెటీరియల్స్‌ను కొనుగోలు చేయడానికి ఏకీకృత వేదికగా
నిలుస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్, డిజైనర్లు లేదా కాంట్రాక్టర్లకు ఫినీష్డ్ షట్టర్లు, ప్లై ఉడ్, హార్డ్‌వేర్,అప్లయెన్సస్ కొనుగోలు కోసం రెడీ మార్కెట్ ప్రాంగణంగా కూడా నిలుస్తుంది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోలాన్స్ కో–ఫౌండర్,సీఈఓ రామ హరినాథ్ కె మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లోని ఇంటీరియర్ డిజైనర్లు, కాంట్రాక్టర్ల కోసం ప్రోలాన్స్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.
ప్రాజెక్టులకు అవసరమైన మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచడంతో పాటుగా స్థానిక తయారీ సహా పూర్తి స్ధాయిలో బ్యాక్ ఎండ్ మద్దతునందిస్తామనే వాగ్ధానం చేస్తున్నాము. వారి ఖాతాదారులైన గృహ యజమానులు ఇప్పుడు హైదరాబాద్‌లో తమ ఇంటీరియర్ డిజైన్ లేదా రెనోవేషన్ ప్రాజెక్టులను సమయానికి డెలివరీ అవుతాయనే భరోసా పొందడమే కాదు అతి తక్కువ ధరలలో తమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చని కూడా భావించవచ్చు’’ అని అన్నారు.ప్రోలాన్స్ ఇప్పటికే తమ ప్రధాన కార్యాలయం కలిగిన బెంగళూరుతో పాటుగా చెన్నైలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడమనేది కంపెనీ ప్రాంతీ య విస్తరణ వ్యూహంలో భాగంగా ఉంటుంది.
హైదరాబాద్ బిజినెస్ హెడ్ అముక్త మాట్లాడుతూ ‘‘మాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన మార్కెట్ హైదరాబాద్. తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అన్ని కీలకమైన జిల్లాలకు ఇక్కడి నుంచి చేరుకోగలము. మా భావి విస్తరణ వ్యూహాలు ఆ దిశగా ఉన్నాయి’’ అని అన్నారు.ప్రోలాన్స్ కో–ఫౌండర్ అండ్ డైరెక్టర్ వివేక్ ఎంపీ మాట్లాడుతూ ‘‘ఆవిష్కరణల నగరం హైదరాబాద్. దేశంలో అతి పెద్ద ఐటీ
కంపెనీలకు నిలయంగా కూడా ఇది వెలుగొందుతుంది. దేశవ్యాప్తంగా విభిన్న నగరాల ప్రజలను ఈ నగరం ఆకర్షిస్తుంది. ఈ ఫలితంగా, గృహ,వర్క్ ప్లేస్ స్వీకరణ పరంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి
మా స్థానిక భాగస్వాముల నుంచి అద్భుతమైన స్పందన అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా ఆటోమేటెడ్ “సాస్” ఆధారిత విధానంతో నగరంలో వృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని
అన్నారు.
ప్రోలాన్స్‌ను 2019లో హోమ్‌లేన్, మైహోమ్‌స్పీక్స్, బెల్లో ఇంటీరియర్స్, డెల్టాక్యాడ్ లో పూర్వ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కో–ఫౌండర్లు ప్రారంభించారు. పూర్తిస్ధాయిలో ప్రాజెక్ట్ ఆటోమేషన్‌తో పాటుగా ఈ ప్లాట్‌ఫామ్ ఇంటీరియర్ డిజైన్ పరిశ్రమలో రెండు ప్రధానమైన ఇబ్బందికరమైన అంశాలు-ముడి పదార్థాల సేకరణ,తయారీ లేదా ఫినిష్డ్
కంపోనెంట్స్-సమస్యను తీర్చుకోవచ్చు. ఈ కంపెనీకి అతి ప్రధానమైన వ్యాపార ఖాతాదారులుగా గోద్రేజ్ ఇంటీరియో,స్పేస్‌ఉడ్, ల్యాండ్‌మార్క్,స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ప్రస్తుతం 500కు పైగా ఇంటీరియర్ డిజైన్ సంస్థలు ప్రోలాన్స్‌కు ఖాతాదారులుగా ఉన్నారు.