365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 21,2021:ప్రోటీన్ నేడు తమ భావితరపు డిజిటల్, సమగ్రమైన విద్య, కెరీర్ మార్గనిర్దేశక వేదికను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. హైస్కూల్ , కాలేజీ విద్యార్థుల కోసం నిర్మితమైన ఈ వేదికతో సమాచారయుక్త కెరీర్ ఎంపికలను 21 వ శతాబ్దంలో తీసుకోవడం వీలవుతుంది. 2015లో ప్రారంభించిన నాటి నుంచి, ప్రోటీన్ 60వేల మందికి పైగా విద్యార్థులతో కూడిన నెట్‌వర్క్‌ను 150కు పైగా ఇనిస్టిట్యూట్లు,కెరీర్ కేంద్రాలతో సృష్టించింది. 600కు పైగా కెరీర్ డెమోలు, 3000కు పైగా అనుభవపూర్వక టాస్క్‌లతో తమ ప్రొప్రైయిటరీ స్టూడెంట్ ఎస్సెస్‌మెంట్స్‌తో సుప్రసిద్ధమైంది.
దూర విద్య , అభ్యాసంను మహమ్మారి మరింతగా విస్తృతపరిచింది. డిజిటల్ విద్య వేదికలకు ఆదరణ గణనీయంగా పెరిగింది. అత్యంత సులభమైన నేవిగేషన్, ఆకర్షణీయమైన సమన్వయం, వ్యక్తిగత కంటెంట్, స్పష్టంగా చర్యతీసుకోగలిగిన విద్య, కెరీర్ మార్గాలు, గేమిఫికేషన్, మరెన్నో అంశాలను ప్రోటీన్ కలిగి ఉంది. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆసక్తికరమైన మార్కెట్ ఫీడ్‌బ్యాక్ వెల్లడించే దాని ప్రకారం, ప్రోటీన్ వేదిక నూతన తరపు విద్య, కెరీర్ మార్గనిర్దేశశాన్ని పూర్తి సరికొత్త వినియోగదారుల అనుభవం, వ్యక్తిగతీకరించిన కంటెంట్ మహోన్నతమైన ఎనలిటిక్స్, విషయాంశాలతో అందిస్తుంది.
సమగ్రమైన విద్య, కెరీర్ మార్గనిర్దేశనం, ఎనలిటిక్స్ అందించడంతో పాటుగా తల్లిదండ్రులు, విద్యార్థులు, కౌన్సిలర్లను శక్తివంతం చేస్తున్న ప్రోటీన్ 3డీ అవగాహన ఇంజిన్‌ప్రోటీన్ సమగ్రమైన సైకోమెట్రిక్ ఎస్సెస్‌మెంట్‌ను ఆప్టిట్యూడ్, ఆసక్తి, బహుళ అంశాల పట్ల పరిజ్ఞానం, వ్యక్తిత్వం ఆధారంగా నిర్మించడం జరిగింది. ఈ ఎస్సెస్‌మెంట్ పరీక్షలను అత్యుత్తమంగా తగిన ఫలితాలను అందించే రీతిలో తీర్చిదిద్దడంతో పాటుగా నిరూపిత శాస్త్రీయ ప్రక్రియల ద్వారా గుణిస్తారు. వాటి సమగ్రమైన స్వభావం కారణంగా ప్రతి విద్యార్థి కెరీర్ అభివృద్ధికి కీలకమైన అంశాన్నీ పూర్తిగా విశ్లేషించి, మ్యాప్ చేయబడిందని నిర్ధారించబడుతుంది.
పోట్రీన్ విశ్లేషణలు, విషయాంశాలు అతి క్లిష్టమైన నేపథ్యాలను సైతం సరళీకృతం చేసి, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు స్పష్టమైన చర్యలు తీసుకోతగిన మార్గం , కెరీర్ నిపుణుల సహాయం ఉన్నా లేదా లేకున్నా సైతం అందిస్తుంది. ఈ సవివరమైన అంశాలు, కేవలం మీరు ఎవరనే అంశాలను తెలుపడమే కాదు, మీ బలాలపై ఏ విధంగా ఆధారపడాలి, అభ్యాస సాంకేతికతలను ఏ విధంగా వినియోగించాలి మరియు బలహీనతల వద్ద ఏ విధంగా మెరుగుపడాలి కూడా వెల్లడిస్తుంది.
ఈ ప్రక్రియలో తల్లిదండ్రులను సైతం భాగస్వాములను చేయడాన్ని ప్రోటీన్ విశ్వసిస్తుంది. అంతేకాదు, చిన్నారుల భావి మార్గానికి తగినట్లుగా ఇవి ఉన్నాయనే భరోసానూ అందిస్తుంది. ప్రోటీన్ భావి తరపు వేదికలు, తల్లిదండ్రులకు కెరీర్ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశం అందించడంతో పాటుగా అతి సులభంగా వినియోగించతగిన డ్యాష్‌బోర్డ్ ద్వారా తమచిన్నారులను మేథస్సును అంచనా వేసి, తమ చిన్నారులు సమాచారయుక్త కెరీర్ నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడేందుకు చురుకైన పాత్ర పోషించాల్సి ఉంది.
ఓ సమ్మిళిత వేదికగా, డిజిటల్‌గా పలు విద్యార్థి ఎస్సెస్‌మెంట్స్, కెరీర్ మార్గాలను డిజిటల్‌గా నిర్వహించడానికి ఓ శక్తివంతమైన సాధనాన్ని అందించడం ద్వారా కౌన్సిలర్లకు తగిన శక్తిని ప్రోటీన్ అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం ఆధునీకరించడం ద్వారా ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ధోరణులు, పరిశ్రమ వాతావరణాన్నీ తెలుసుకుంటుంది. సైకోమెట్రిక్ ఎస్సెస్‌మెంట్స్ పై ఆధారపడి, విస్తృతశ్రేణిలో కెరీర్ డెమో లైబ్రరీ, వాస్తవ ప్రపంచపు ధోరణులను ప్రతిబింబించే లోతైన విషయాంశాలతో, కౌన్సిలర్లు , విద్యార్థులకు సాటిలేని మార్గనిర్దేశనం అందించడంతో పాటుగా సరైన సమయంలో సరైన ఎంపికలనూ తీసుకోవడంలో సహాయపడతారు.సమగ్రమైన విషయ పరిజ్ఞానంతో పాటుగా విద్యార్థులందరికీ టాప్ స్ట్రీమ్, కెరీర్‌సిఫార్సులు
భవిష్యత్‌లో తగిన అవకాశాలను పొందే సామర్థ్యం కోసం ఒకరి వ్యక్తిగత సామర్ధ్యం అంచనా వేయడం నుంచి, పని ప్రాంగంలో ఓ రోజు చేసిన పనిని అర్థం చేసుకోవడం, దానిలోని కష్టనష్టాలను తెలుసుకోవడం నుంచి, సమాచారయుక్త నిర్ణయాలను తీసుకోవడంలో అత్యంత కీలకమైన ప్రతి అంశాన్నీ ప్రోటీన్ పరిశీలిస్తుంది. ఈ వైవిధ్యమైన ఫీచర్లు, వ్యక్తులు పూర్తి సమాచార యుక్త నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 8–10 తరగతి విద్యార్థులకు అత్యున్నతమైన అకడమిక్ స్ట్రీమ్స్, సబ్జెక్ట్‌లను సూచించడం జరిగింది. అదే సమయంలో 11–12 తరగతులు, కాలేజీల విద్యార్ధులకు ఉన్నతమైన కెరీర్ అవకాశాలను వారి సైకోమెట్రిక్ పారామీటర్లకు అనుగుణంగా అందించడం జరిగింది. సమగ్రమైన,డౌన్‌లోడ్ చేయతగిన ఎస్సెస్‌మెంట్ నివేదిక తక్షణమే లభ్యమవుతుంది. ఇది విద్యార్థుల బయోగ్రఫీ అందించడంతో పాటుగా వారి జీవిత కథలు, బలాలు, వ్యక్తిత్వం,బలవంతపు భవిష్యత్ రోడ్ మ్యాప్‌ను అందిస్తుంది.
అతి సులభంగా వినియోగించతగిన సహకారంతో వ్యక్తిగతీకరించిన డాష్‌బోర్డ్ పూర్తి సరికొత్త ప్రోటీన్ ఇంజిన్‌ను, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎడ్‌టెక్ పరిశ్రమలో మారుతున్న అవసరాలకు తగినట్లుగా ట్యూన్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఆధునీకరించిన డాష్‌బోర్డ్ సెట్‌తోపాటు సరళ మైనప్పటికీ,ఆకర్షణీయమైన వినియోగదారుల అనుభవాలనూ అందిస్తుంది. వ్యక్తిగతీకరించిన సంబంధిత సమాచారం, స్పష్టంగా నిర్వచించిన దశలు, అతి సులభమైన వినియోగదారు అనుభవాలు వంటివి వినియోగదారులకు అసాధారణ విలువను అందించడంతో పాటుగా ఉత్సాహపూరితమైన భవిష్యత్ దిశను కనుగొనేందుకు సైతం అవకాశమందిస్తుంది. వయసు, విద్య, ఆసక్తులు వంటి పలు అంశాల ఆధారంగా, ప్రోటీన్ ప్లాట్‌ఫామ్ లోతైన వ్యక్తీగతీకరణను అందిస్తుంది. ఇది విద్యార్థులు తమ కెరీర్ మార్గాలను సమగ్రమైన, స్వీయ నిర్వహణ వ్యవస్ధల ద్వారా మ్యాప్ చేసేందుకు అవకాశం అందిస్తుంది.
నూతన తరపు కెరీర్ అవకాశాలు, తల్లిదండ్రులకు అంకితం చేసిన వేదికను జోడిస్తుందివిద్యార్థులు,తల్లిదండ్రులు పూర్తిసమాచారయుక్త, పరిశోధనాధారిత నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతూ ప్రోటీన్ 100కు పైగా నూతన తరపు కెరీర్ అవకాశాలను తమ ప్రస్తుత లైబ్రరీ 500కు పైగా కెరీర్స్‌కు జోడించింది. రెగ్యులర్ కెరీర్స్‌కు అదనంగా, ప్రోటీన్ ఇప్పుడు నూతన కెరీర్ మార్గాలను సైతం పరిచయం చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ , ఫుడ్ టేస్టర్ నుంచి సస్టెయినబిలిటీ , శక్తి నిర్వహణలో గ్రీన్ జాబ్స్ వరకూ ప్రోటీన్ ఇప్పుడు మారుతున్న కెరీర్ ప్రపంచంలో వాస్తవాలను విద్యార్ధుల ముందు ఉంచుతుంది. కెరీర్‌లో ఎత్తు పల్లాలను గురించి పూర్తిగా తెలుపడంతో పాటుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తమ ఇళ్లలో ఉండి పూర్తి సమాచారయుక్తంగా నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతుంది. పాఠశాలలు, కోచింగ్ కేంద్రాలు, కళాశాలతో అతి సులభంగా అనుసంధానించబడుతుంది
ప్రోటీన్ సాంకేతిక ఆర్కిటెక్చర్ అతి సులభంగా తృతీయ పక్ష బీ2బీ విద్యావేదికలతో మిళితం కావడంతో పాటుగా అత్యున్నతంగా విస్తరించతగిన, అనుకూలీకరించ తగినది పరస్పరం పనిచేసేలా చేస్తుంది. ఇది ప్రోటీన్, నేటి సాంకేతికాధారిత విద్యా మార్కెట్ అవసరాలను స్వీకరించడంతో పాటుగా ఎక్కువ సంఖ్యలో వినియోగదారుల కోసం అతి సులభమైన ప్రాప్యత అత్యుత్తమ సహకారం అందిస్తుంది.ఈ ఆవిష్కరణ గురించి పరిధి ఖైతాన్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రోటీన్ మాట్లాడుతూ ‘‘ మహమ్మారి కారణంగా ఎడ్‌టెక్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. భారీ స్థాయిలో నూతన బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఓ డిజిటల్ ఉత్పత్తి నుంచి విద్యార్థుల డిమాండ్లు , అంచనాల పరంగా భారీ మార్పులు వచ్చాయి. ప్రోటీన్ భావితరపు ప్లాట్‌ఫామ్‌ను మా వినియోగదారుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, విస్తృతశ్రేణి విద్యా వ్యవస్థకు స్పందనగా రూపకల్పన చేశాము. ఇది వినియోగదారుల అవసరాలను అత్యుత్తమంగా అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడింది.
మరీముఖ్యంగానగదుకుతగ్గవిలువ, స్పష్టత, వినియోగం, అనుసంధానిత పరంగా ఇది తోడ్పడింది. భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ శక్తివంతమైన, సమగ్రమైన అకడమిక్ స్ట్రీమ్,కెరీర్ గైడెన్స్ ప్లాట్‌ఫామ్‌ను విడుదల చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము వారి అభిప్రాయాలను వింటున్నాము. వారు కోరుకుంటున్నది వారికి అందిస్తున్నాము!’’ అని అన్నారు.