
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,జనవరి 31,2022: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా భజన మండళ్ల కళాకారులు శ్రీపురందరదాస కీర్తనలను చక్కగా ఆలపించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు బృందాల వారీగా కళాకారులు దాస పదాలను గానం చేశారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1న అలిపిరిలో పుష్పాంజలి

ఆరాధనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మంగళవారం ఉదయం 6 గంటలకు అలిపిరి వద్దగల శ్రీ పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు.