365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 6, 2024: గొప్ప విజయసాధనలో భాగంగా, 14 సంవత్సరాల షూలిని యూనివర్శిటీ టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ ఈ) ర్యాంకింగ్స్ ద్వారా నంబర్ వన్ స్థానం సాధించిన కొద్ది సమయంలోనే దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ యూనివర్శిటీగా ప్రతిష్టాత్మకమైన ర్యాంకింగ్ ఏజెన్సీ, క్వాక్ క్యురెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ద్వారా వరల్డ్ యూనివర్శిటీస్ ర్యాంకింగ్స్ 2025లో ర్యాంక్ సాధించింది.
కెమిస్ట్రీ, ఫిజిక్స్, అస్ట్రానమీలో SCIMAGO ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో ఉండటంతో పాటు దేశంలోనే ఉత్తమమైన యంగ్ ప్రైవేట్ యూనిర్శిటీగా ర్యాంక్ సాధించిన తరువాత ఈ రెండు గుర్తింపులు కీర్తి కిరీటంగా వచ్చింది.
హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఉన్న ఈ యూనివర్శిటీ, గత ఏడాది 771-780 బ్యాండ్ నుంచి అంతర్జాతీయంగా 587 ర్యాంక్ లో చేర్చింది. గత ఏడాది 20వ స్థానంతో పోలిస్తే దేశంలో మొత్తంగా 14వ స్థానంలో నిలిచింది.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే, దేశంలో మొత్తం ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో నిలువగా ఇండియన్ ఇన్ సిట్టూయట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ తదుపరి స్థానం ఆక్రమించింది, అంతర్జాతీయంగా మసాసుచెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగ్రగామిగా నిలువగా తదుపరి స్థానాన్ని ఇంపీరియల్ కాలేజ్, లండన్ చేజిక్కించుకుంది.
షూలిని యూనివర్శిటీ ఈసారి 5.9 మార్క్స్ నమోదు చేసింది. గతంలో 15.2 మార్స్క్ పొందగా ఈసారి 21.1 మార్క్స్ సంపాదించింది.
యూనివర్సిటీ సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీలో 319 నుంచి 224కి తన ర్యాంకింగ్స్ ను కూడా మెరుగుపరుచుకుంది. ఎంప్లాయర్ రెప్యుటేషన్ లో 600 నుండి 561కి మెరుగుపడింది. ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీలో గత ఏడాది 545 అంతర్జాతీయ ర్యాంక్ సాధించగా ఇప్పుడు 486వ ర్యాంక్ సాధించింది.
సుస్థిరత విభాగంలో కూడా యూనివర్శిటీ మెరుగుపడింది. దీనిలో ఇది అంతర్జాతీయంగా గత ఏడాది 700 ర్యాంక్ పొందగా ఇప్పుడు 570 ర్యాంక్ పొందింది.
షూలిని యూనివర్సిటీ, ఫౌండర్ ,ఛాన్స్ లర్, ప్రొఫెసర్ పీకే ఖోస్లా మాట్లాడుతూ, 14 ఏళ్ల యూనివర్శిటీ సాధించిన గొప్ప విజయం అనేది నాణ్యతతో కూడిన విద్య, పరిశోధనపై నిరంతరంగా దృష్టి కేంద్రీకరించడం వలన సాధ్యమైంది.
“పరిశోధనపై దృష్టి కేంద్రీకరించడంలో నేను చేసిన ప్రయత్నం ఫలితం సాధించినందుకు నాకు సంతోషంగా ఉంది,” అని ఆయన అన్నారు.
విద్యార్థులు, సిబ్బందిని ప్రశంసిస్తూ, ప్రో ఛాన్స్ లర్ శ్రీ విశాల్ ఆనంద్ ఇలా అన్నారు, ప్రముఖ అంతర్జాతీయ యూనివర్శిటీని రూపొందించే దిశగా షూలినీ తన పనిని కొనసాగిస్తోంది. ఐఐఎస్ సీ, ఐఐటీలు, జేఎన్ యూ వంటి భారతదేశపు దిగ్గజ సంస్థల్లో షూలిని ఒక యూనివర్శిటీగా నిలవడం నిజంగా ప్రశంశించదగిన అంశం.
టాప్ 200 అంతర్జాతీయ ర్యాంక్ దిశగా మేము చేసే కృషి కొనసాగుతుంది. భవిష్యత్తు ప్రయాణానికి ఈ విజయం మా టీమ్స్ కు ప్రేరణ కలిగిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని ఆయన అన్నారు.
వైస్ ఛాన్స్ లర్, ప్రొఫెసర్ అతుల్ ఖోస్లా, మాట్లాడుతూ యువ విశ్వవిద్యాలయం కోసం లభించిన అత్యంత ప్రత్యేకమైన ర్యాంకింగ్స్ యూనివర్శిటీ, యాజమాన్యం ,పరిశోధకులు చేసిన కృషి ఫలితం. ఆయన ఇంకా ఇలా అన్నారు: “మా కృషి ఈ ర్యాంకింగ్స్ తో ఆగిపోదు. మేము గొప్ప విద్యార్థులను తయారు చేయడాన్ని కొనసాగిస్తాము. గొప్ప పరిశోధనను కొనసాగిస్తాం.
మన సమాజానికి నిరంతరంగా తోడ్పాటు అందిస్తాం. భారతదేశం బయట ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఒక నిస్వార్థమైన లక్ష్యం. అది ఒక అంతర్జాతీయ నాయకుడు. అది విభిన్నమైనది ,ప్రపంచంలో కొన్ని ప్రముఖ యూనివర్శిటీలు అనుసరించడానికి ఇది ఒక ఆదర్శవంతమైన నమూనాగా నిలుస్తుంది.”
క్యూఎస్ వరల్డ్ యూనివర్శఇటీ ర్యాంకింగ్స్ 2025, భారతదేశంలోని 46 ప్రదేశాలు సహా మొత్తం 106 ప్రదేశాల్లో 1503 సంస్థలను కలిగి ఉన్నాయి. భారతదేశంలో మొత్తం ర్యాంక్ పొందిన యూనివర్శిటీలలో, 28 తమ ర్యాంకింగ్స్ ను పెంచుకోగా నాలుగు వైదొలిగాయి. 11 తమ ర్యాంక్ లేదా బ్యాండ్ లో స్థిరంగా నిలిచాయి.