Tue. Dec 17th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మే 23,2022: ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అదేవిధంగా, ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, జులై నెల‌కు సంబంధించిన అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న సేవ టికెట్ల‌ను మే 24న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 26వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి స‌మాచారం అందిస్తారు. భ‌క్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.

కాగా, జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుండి మొద‌ల‌వుతుంది

error: Content is protected !!