365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, రాజమహేంద్రవరం,జనవరి 22,2022: నూతన సంవత్సరంలో తొలి నెలలోనే తమ రెండవ ఔట్‌లెట్‌ను ప్యారడైజ్ తెరిచింది. రాజమహేంద్రవరంలో ప్యారడైజ్ అడుగుపెట్టడమే కాదు ప్రపంచం అభిమానించే బిర్యానీని రాజమహేంద్రవరం వాసుల చెంతకు తీసుకువచ్చింది. అధికారికంగా తమ పూర్వ నామకరణం వద్దకు చేరిన రాజమమహేంద్రికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మొట్టమొదటగా ఈ నగరాన్ని విష్ణువర్థనుడు నిర్మించాడు. ఆ తరువాత ఎంతో మంది ఈ నగరంలో తమ పాలనను కొనసాగించడంతో పాటుగా కోటలు, ప్యాలెస్‌లను నిర్మించారు. ఇప్పుడు అత్యద్భుతమైన బిర్యానీ రావడంతో, నిజామ్‌లు తమ ప్రాచుర్యం పొందిన వంటకాలను రాజమహేద్రవరంకు తీసుకువచ్చిట్లయింది.
మహోన్నత తెలుగు సాహిత్యం, కళలు, సంస్కృతికి నిలయం ఈ నగరం. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఫిల్మ్ స్టూడియో కలిగిఉండటంతో పాటుగా కందుకూరి వీరేశలింగం లాంటి మహోన్నత వ్యక్తులకు నిలయమూ ఇది. ఆంధ్రప్రదేశ్‌కు పునరుజ్జీవన కేంద్రంగా రాజమహేంద్రవరం నిలుస్తుంది. ఈ తాజా ప్రారంభంతో ఈ ఓమ్నీ ఛానెల్ రెస్టారెంట్ మరోమారు రాజమహేంద్రవరంను మ్యాప్‌పైకి తీసుకువస్తుంది.
ప్రతి ప్యారడైజ్ రెస్టారెంట్ ప్రారంభంతో, వారు తమ ప్రమాణాలు , అత్యున్నత నాణ్యతను నిర్వహిస్తున్నామనే భరోసాను అందిస్తున్నారు. మహమ్మారి కాలంలో నాణ్యత నియంత్రణ ప్రమాణాలు అనుసరించడంతో పాటుగా ప్రామాణిక మార్గదర్శకాలనూ అనుసరిస్తున్నారు.సందర్శకులు ఇప్పుడు తమ జిహ్వచాపల్యం ను తీర్చుకుంటూ అత్యుత్తమ బిర్యానీ, కబాబ్,మరెన్నో అంశాలను రుచి చూడవచ్చు .వీటన్నిటినీ వినియోగదారులకు అత్యుత్తమ పరిశుభ్రత,సంరక్షణతో అందిస్తున్నారు .ప్రస్తుత సమయంలో అన్ని చోట్లా అత్యుత్తమంగా అవసరమైన వేళ ఇక్కడ వడ్డించే ఆహారం కూడా అదే స్ధాయి భద్రతను కలిగి ఉంటుంది. తాడితోట వద్ద 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రెస్టారెంట్ ఉంది.రాజమహేంద్రవరంలోని ఆహారాభిమాను లు,దగ్గరలోని ప్రాంతాలు ఇప్పుడు ప్రతిష్టాత్మక బిర్యానీలు, కబాబ్‌లు, డెసర్ట్స్‌తో పాటుగా ప్యారడైజ్ రుచులను తమ రుచులకనుగుణంగా ఆస్వాదించవచ్చు.
ఈ నూతన రెస్టారెంట్ ప్రారంభం గురించి శ్రీ అలీ హేమతి, ఛైర్మన్– ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యానికి మహోన్నత స్థాయిని కట్టబెట్టిన ఉత్కృష్టమైన ప్రాంతం రాజమహేంద్రవరం. నన్నయ్య సహా ఎంతో మంది కవులకు పుట్టినిల్లు ఈ ప్రాంతం. ఈ చారిత్రాత్మక నగరానికి మా రెస్టారెంట్‌ను తీసుకురావడం పట్ల మేమెంతో గర్వంగా ఉన్నాము. మహోన్నత వ్యక్తులకు నిలయం ఈ పట్టణం. ఈ సంవత్సరం జనవరిలో ఇది మా మూడవ ఆవిష్కరణగా ఇది నిలుస్తుంది. అయితే ఇది ప్రత్యేకమైనది. ఈ నూతన సంవత్సర రెండవ వారంలో కూడా పండుగ స్ఫూర్తిని మేము కొనసాగిస్తున్నాము. కానీ మా సందర్శకులు మాకు అత్యంత కీలకం. ప్రతి రోజూ గడిచే కొద్దీ నాణ్యమైన ఆహారం తీసుకువచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.
ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్‌లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ కజీమ్ మాట్లాడుతూ ‘‘రాజమహేంద్రవరం లో కూడా మా నూతన ప్యారడైజ్ రెస్టారెంట్ ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ వారంలోనే ఇది మా మూడవ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.ఇది అత్యద్భుతమై న రెస్టారెంట్‌గా నిలుస్తుంది. రాజమహేంద్రవరంను ప్రతి రోజూ ఎంతో మంది సందర్శిస్తుంటారు. ఇక్కడి పరిశ్రమలు, కళలు, సంస్కృతికి ఉన్న ప్రాచుర్యం చేత ఇది ప్రజలపై చూపే ప్రభావం కూడా ఉన్నతంగా ఉంటుంది. మా ట్రేడ్‌మార్క్ బిర్యానీతో వారికి విందు అందించడం పట్ల మేము సంతోషంగా ఉన్నాము. తద్వారా ప్యారడైజ్ అత్యుత్తమతను వీరు ఆస్వాదించగలరు’’ అని అన్నారు.
శ్రీ గౌతమ్ గుప్తా, సీఈవో–ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ ఆంధ్రప్రదేశ్‌కు తూర్పు భాగంలో ఉన్న రాజమహేంద్రవరంకు మా రెస్టారెంట్‌ను తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. పరిశ్రమలు, పర్యాటకానికి అత్యంత ప్రాచుర్యం పొందినది రాజమహేంద్రవరం. ఇక్కడ విభిన్న సంస్కృతుల ప్రజలు ఉండటం చేత మా ఔట్‌లెట్ ప్రారంభం సహతుకం. ఇది మా 48వ ఔట్‌లెట్, మరిన్ని రెస్టారెంట్‌లను ప్రారంభించనున్నాం.మా సమర్థవంతమైన నాయకత్వంకారణంగానే ఇది సాధ్యమైంది,ప్యారడైజ్ వారసత్వం కొనసాగించనున్నాము’’ అని అన్నారు.
ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్ చేసిన రెస్టారెంట్ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్ కాంగ్రెస్ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా,గోల్డెన్ స్పూన్ అవార్డు ను ఇండియా ఫుడ్ ఫోరమ్ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్ , జీహెచ్‌ఎంసీ, టైమ్స్ ఫుడ్ అవార్డ్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణా, లైఫ్‌టైమ్ అావ్‌మెంట్ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది