365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 19,2024:ఆడవారిని ఆనందంగా జీవించేలా చేయడమే రాఖీ ఉద్దేశమని యోగా గురు బి.సరోజని రామారావు, డా.గీత, డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.ఇందిరా పార్క్ లో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించారు.
*ప్రేమ ఆప్యాయతను కనబరచడానికి నీకు ఏ కష్టమొచ్చినా నేనున్నాను అని మగవారి నుంచి అభయం తీసుకుంటుందన్నారు.
*చెప్పాలంటే ఇది మనుషుల మధ్య జరిగే ఆత్మీయ సంఘటన అని తెలిపారు. ఆడవారు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు.
మనం భూమి మీద నుంచి ఏమి తీసుకువెళ్ళలేము కేవలం ప్రేమను ఇవ్వడం తప్ప అని
*యోగా గురు బి రామారావు మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అందరికీ సంతోషాన్నిపంచితే మనం సంతోషంగా ఉంటామన్నారు.
శ్రీలతా రాజేంద్ర మహిళలకు పర్సులు అందజేసారు.
డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ గాంధీ ఆడవారికి అర్థరాత్రి స్వతంత్రం కావాలన్నారు.కానీ నేటి సమాజంలో పగలు కూడా తిరగలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రాజేంద్ర కుమార్, పవన్, వెంకటేష్, రాజా నరసింహ, శేఖర్ రెడ్డి, ప్రహ్లాదుడు,డా.గీత, పుర్ణ కుమారి, వాణిశ్రీ, జ్యోతి రాజా, పి.స్వరూపారాణి, యోగా సాధకులు పాల్గొన్నారు.