365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు13, 2022:ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదరీమణుల రాకతో సీఎం కేసీఆర్ నివాసంలో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను కేసిఆర్ సతీమణి శోభ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన అక్కలు, లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మలకురాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసిఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వారు సోదరున్ని నిండు మనసుతో ఆశీర్వదించారు.
సీఎం కేసిఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు మనుమరాలును సీఎం కేసిఆర్ శోభ దంపతులు దీవించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.