Mon. Dec 23rd, 2024
Ramyakrishna has an inexhaustible beauty even after fifty.

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 23,2022: ఐదుపదులు దాటినా రమ్యకృష్ణ అందం ఏమాత్రం తగ్గలేదు.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ల అందంతో ఆమె పోటీపడు తున్నారు అంటే అతిశయోక్తి కాదు. కొన్ని పాత్రల్లో ఆమె తప్ప మరొకరు చేయలేరనేంతగా రమ్యకృష్ణ తనకు ఇచ్చిన క్యారెక్టర్ లో లీనమై కినిస్తారామె.

విలన్, గానీ దేవతగానీ ఆమె సరైన న్యాయం చేస్తారు..ఆమె కరెక్ట్ అనేలా రమ్యకృష్ణ తనదైన ముద్ర వేశారు.త్వరలోనే ఆమె లైగర్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఇన్​స్టాలో తన లేటెస్ట్ ఫొటోషూట్​ను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆమె ఆందానికి ఫిదా అయిపోతున్నారు.

వయసు పెరిగినా అందం ఏమాత్రం తగ్గలేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో సింహాసనంపై రాజసాన్ని పలికించే శివగామిగా ఆమె ఒదిగిపోయారు. నరసింహ చిత్రంలో విలనిజాన్ని పండించే నీలాంబరిగా , తలపై కిరీటం పెట్టి శూలం పట్టుకుంటే దేవతలా మారిపోయేవారామె..

Ramyakrishna has an inexhaustible beauty even after fifty.

కన్నీళ్లు పెట్టించే సామాన్య గృహిణి..ఇలా ఒకటేమిటి ఎన్నో పాత్రలకు రమ్యకృష్ణ జీవం పోశారు. మరెన్నో క్యారెక్టర్లు ఆమె కోసమే పుట్టాయనేంత అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి రమ్యకృష్ణ.

ఆమె వయసు కంటే వారు ప్రస్తుతం అడపాదడపా పాత్రలు పోషిస్తుంటే తాను మాత్రం ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు.

error: Content is protected !!