Sat. Dec 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్, మే10, 2023: హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని మా ఆస్ప‌త్రి మ‌రో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. మరోసారి అరుదైన ఆప‌రేష‌న్ చేసి విజయం సాధించింది. 65 ఏళ్ల వ్య‌క్తికి మోకాలి మార్పిడి విజ‌య‌వంతంగా “మా” హాస్పిటల్ నిర్వహించింది.

ఆర్థోవ‌న్ ఎండీ, ప్ర‌ముఖ‌ ఆర్థోపెడిక్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ వి. కోటేశ్వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో ఈ శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించారు. జీవితంలో ఇక‌పై న‌డ‌వ‌లేన‌నే నిరాశ‌లో ఉన్న పేషెంట్ కు కొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు.https://maaent.com/index.html

దాదాపు మూడు నెల‌ల క్రితం 65 ఏళ్ల పేషెంట్ ప్ర‌మాద‌వ‌శాత్తు కింద ప‌డిపోవ‌డంతో కాలు విరిగింది. దీంతో ఓ ఆస్ప‌త్రిలో చేర్చారు.పేషెంట్ ను ప‌రిశీలించిన అక్క‌డి డాక్ట‌ర్ కాలు విర‌గ‌లేద‌ని.. కొద్దిరోజులు క‌ట్టు క‌డితే త‌గ్గిపోతుంద‌ని చెప్పారు. అలా రెండు, మూడు నెల‌లు గ‌డిచాయి. తీరా చూస్తే ఆ కాలు మూడించులు పొట్టిగా అయిపోయింది. విరిగిన‌ మోకాలి భాగం స్టిఫ్ గా మారింది.

ఈ ప‌రిస్థితుల్లో రోగిని మా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సేవ‌లందిస్తున్న త‌మ ద‌గ్గ‌రికి తీసుకొచ్చార‌ని టీమ్ ఆర్థోవ‌న్ ఎండీ డాక్ట‌ర్ వి. కోటేశ్వ‌ర ప్ర‌సాద్ తెలిపారు. అత‌నికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారో వివ‌రించారు.

” పేషెంట్ కండిష‌న్ ను స్ట‌డీ చేశాం. స‌మ‌స్య‌ను గుర్తించాం. అత‌డు ఇదిర‌వ‌కులా న‌డ‌వాలంటే విరిగిన ఎముక‌, మూడించుల షార్ట్ నెస్.. ఈ రెండింటీనీ స‌రిచేయాలి. కానీ వ‌య‌సు రీత్యా ఇత‌ర టెక్నిక్స్ వాడి ఆయ‌న మోకాలును బాగు చేసే అవ‌కాశం లేదు. అందుకే స్పెష‌ల్ ఇంప్లాంట్స్ ఉప‌యోగించామని ఆయన అన్నారు.

వాటినే ఇంట్రా మిడిల‌రీ రాడ్స్ అని పిలుస్తారని, అలాంటి కొన్ని ప్ర‌త్యేక టెక్నిక్స్ వాడి మోకాలి మార్పిడి చేశామని, దీంతో పేషెంట్ కోలుకున్నారని చెప్పారు. కేవ‌లం రెండు రోజుల్లోనే డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఎప్ప‌టిలాగే న‌డ‌వ‌గ‌లుగుతున్నారు” అని డాక్ట‌ర్ వి. కోటేశ్వ‌ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు.

అంత‌కుముందు దాదాపు మూడు నెల‌లు ఆ పేషెంట్ చాలా ఇబ్బందులు ప‌డ్డారు. క‌నీసం మంచం మీద‌ నుంచి క‌దిలే వీలు లేకుండా పోయింది. అలాంటి వ్య‌క్తిని డాక్ట‌ర్లు పూర్వ‌పు స్థితికి తీసుకొచ్చి కొత్త వెలుగులు నింపారు. https://maaent.com/index.html

“మా” ఇ ఎన్ టి హాస్పిటల్ లో టీమ్ ఆర్థోవ‌న్ వైద్యుల‌ బృందం సేవ‌ల‌ను అందిస్తోందని డాక్ట‌ర్ వి. కోటేశ్వ‌ర ప్ర‌సాద్ చెప్పారు. “మా” ఆస్ప‌త్రిలో ఎండో స్కోపిక్ స్పైన్, కీ హోల్ స‌ర్జ‌రీ,రీ జ‌న‌రేటివ్ ఆర్థోపెడిక్, మినిమ‌ల్లీ ఇన్వైసివ్ టోట‌ల్ నీ రీప్లేస్ మెంట్ వంటి వాటిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలిపారు. నొప్పులు నివారిస్తామ‌ని, మెరుగైన వైద్యం అందిస్తామ‌ని ఈ రోజుల్లో చాలా మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని..వాటి ప‌ట్ల జ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. https://maaent.com/index.html

మా హాస్పిటల్ సీఎండీ సునీత కుమార్ మాట్లాడుతూ ఏదైనా స‌మ‌స్య వ‌స్తే దానికి సంబంధించిన స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దిస్తేనే స‌రైన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని తెలిపారు. పేద రైతును దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుకే ఈ సర్జరీని విజయవంతంగా చేశామని,”మా” హాస్పిటల్ లో ఆర్థో సంబంధిత అన్ని సమస్యలకు చికిత్స అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

error: Content is protected !!