Jamalapuram_Rathasapthami

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం, జనవరి 29,2023: సూర్యప్రభ వాహనంపై జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని వేకువుజమున శ్రీవారికి పంచామృతాభి అభిషేకాలతో స్వామివారి అభిషేకించారు.

అనంతరం రథసప్తమి వేడుకల్లో ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Jamalapuram_Rathasapthami

సూర్యుడు దక్షిణాయనము నుంచి పూర్వోత్తరాయణానికి చేరుతాడని, తద్వారా సమస్థలోక భక్తజనులకు సకల శుభాలు కలగాలని, ఆవు పిడకల మంటపై తయారుచేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన గావించారు.

అనంతరం భక్తులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జగన్మోహన్ రావు, సూపరిండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి, స్వామి తదితరులు పాల్గొన్నారు.