365తెలుగుడాట్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, జనవరి 29, 2023: కల్ప వృక్షవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి అభయం ఇచ్చారు. తిరుమలలో శనివారం ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా ఐదో వాహనమైన కల్పవృక్ష వాహనసేవ ఘనంగా జరిగింది.
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి.
అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్,మొరంశెట్టి రాములు, మారుతి ప్రసాద్, మధుసూదన్ యాదవ్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ, బాలాజి, చీఫ్ ఇంజినీర్ ,నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు ఇతర టిటిడి అధికారులు ఈ వాహన సేవలో పాల్గొన్నారు.