- గ్రౌండ్ రిపోర్ట్ : రత్నకిశోర్ శంభుమహంతి
మార్నింగ్ రాగా, విశాఖ నగరం : విశాఖ రుణం తీర్చుకోలేనిది..నేను ఓడిపోతే గుండెల్లో పెట్టుకున్నారు. విశాఖ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఓడిపోయాక తిరిగి జీవం పోసింది విశాఖపట్నం. విశాఖ నుంచే ఎక్కువ మంది మగువలు మిస్సింగ్ నేను చెప్పిన లెక్కల కన్నా ఐదు వందలు ఎక్కువ కేంద్రం చెప్పింది.
పార్లమెంట్లో హోం శాఖ ధ్రువీకరించింది. ఇదే పెందుర్తిలో వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడాను. నాకు మీపై ద్వేషం లేదు. మీరు నా సోదరులు సోదరీమణులు. డేటా మిస్ యూజ్ అవుతుంది. వలంటీర్లు చేస్తున్నది చట్ట విరుద్ధం. ఈ నేల కోసం పనిచేసి ప్రాణాలు తెగించేవాడు కావాలి నేనున్నాను. ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డా అయిపోయింది.
29వ ర్యాంకులో ఉండే ఏయూ 76వ స్థానానికి వెళ్లిపోయింది. ఐదేళ్లు కాకమునుపే ఈ దుః స్థితి నెలకొంది. సెక్యురిటీ అక్కడ గంజాయి అమ్ముతారు. వైసీపీ నాయకుల బర్త్ డేలు చేస్తారు. హాస్టల్ ఫీజులు పెంచేశారు. హార్టికల్చర్ బయో టెక్నాలజీ ఫిషరీస్ అగ్రీకల్చర్ విభాగాలు తీసేశారు.
ఏయూ వీసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లి ఓట్లేయమని అడుగుతారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (హెచ్ఆర్డీ) కు ఏయూ వీసీ పై ఫిర్యాదు చేస్తాను. రీసెర్చ్ ఫండ్ లేదు. పీహెచ్డీ విద్యార్థులకు ఎంకరేజ్ మెంట్ లేదు. ఏయూను నువ్వు భ్రష్టు పట్టించావు జగన్. నువ్వు భ్రష్టు పట్టించావు. జనసేన ప్రభుత్వం రాగానే ఏయూను ప్రక్షాళన చేసి తీరుతాం.
జగన్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రతి ఒక్కరి డేటా కేంద్రం దగ్గర ఉంది. అందరి బండారం త్వరలోనే బయటపడనుంది. హోం మంత్రి అమిత్ షా చెప్పిన ప్రకారం.. అరాచక శక్తుల అడ్డాగా విశాఖ మారిపోయింది. ల్యాండ్ స్కాం మైనింగ్ స్కాం మెడికల్ మాఫియా ఎక్కువైపోయింది అని చెప్పారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు అందిస్తుంటే దానికి జగన్ స్టిక్కర్లు అంటించి పంపిణీ చేస్తున్నారు. మూడు లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్లు.
యాభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. బై జూస్ కంపెనీకి ఐదు వందల కోట్లు ఇచ్చారు. ఇది దివాలా తీసిన కంపెనీ. కానీ విద్యార్థుల ఫీజు రీ యింబర్స్మెంట్ కు నిధులు లేవు. విశాఖలో పాపులర్ సర్క్యూట్ హౌస్ ఇంకా అనే ప్రభుత్వ ఆఫీసులు, గోపాలపట్నం రైతు బజారుకు చెందిన స్థలాలు,ఇంకా ఇతర ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ స్థలాలు..ఇవన్నీ కలిపి 120.70 ఎకరాలు. వీటిని పాతిక వేల కోట్లకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు.
జగన్ నాయకుడు కాదు వ్యాపారి. వాటాలు అడగడం ఓ అలవాటు అయిపోయింది జగన్ కు. డబ్బు పిచ్చి పట్టింది ఆయనకు. డబ్బు అబ్సెషన్ అయింది జగన్ కు. పిచ్చి వీళ్లకు. డబ్బు ఒకరి దగ్గర పేరుకుపోయే కొద్దీ మనం ఎలా బతకాలో వారే చెబుతారు. డబ్బు ఒకరి దగ్గర అడ్డగోలుగా కష్టపడకుండా వచ్చిన డబ్బు కారణంగా అది మనల్ని బానిసలు గా చేస్తుంది. గుర్తు పెట్టుకోండి ఇటువంటి వ్యక్తులపై కన్ను వేసి ఉంచాలి.
జగన్ కు మీరు ఎన్ని ఇచ్చినా ఆయనకు డబ్బు పిచ్చి పెట్టింది. నేను మారిన మనిషిని అని చెప్పినా మీరు నమ్మకండి. రూ.30 వేల కోట్లు మద్యంమీద ఆదాయం సంపాదించారు జగన్. సారా నుంచి సిమెంట్ పరిశ్రమ దాకా అన్నీ జగన్ పేరిటే ఉన్నాయి. అధికారం జగన్ కు ఇచ్చింది పాలించమని పీడించమని కాదు. అన్ని పదవులూ ఒకే కుటుంబానికే దక్కితే వీరు వ్యక్తికి కట్టుబడి ఉంటారు. కులానికి కట్టుబడి ఉంటారు. కానీ మేం అధికారంలోకి వస్తే అన్ని కులాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తాం. ప్రాతినిధ్యం కల్పిస్తాం.
జగన్ ఓ దొంగ. కాగ్ వివరం ప్రకారం లెక్కలు చూపించకుండా దోచేశారు. వీటి గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. 13372 పంచాయతీలకు ఇచ్చిన నిధులు గుంజుకుంటున్నారు. గాంధీ కల ప్రకారం పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం అంటే వలంటీర్లను నియమించడం కాదు. గ్రామ స్వరాజ్యం అంటే వలంటీర్లను నియమించడం కాదు.
పంచాయతీ డబ్బులనే వలంటీరు వ్యవస్థలకు డబ్బులు ఇచ్చేశారు. పంచాయతీల స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నాం. అధికార వికేంద్రీకరణ జరగాలి. కేంద్రం నుంచి నేరుగా నిధులు మీకు వచ్చే విధంగా నేను చేస్తాను. నేను మీకు మాట ఇస్తున్నాను. గ్రామ సభలను బలోపేతం చేస్తాం. స్థానిక ప్రకృతి వనరుల మీద సంపూర్ణ హక్కు గ్రామ సభకే ఉండాలి అని భావిస్తూ వాటి బలోపేతానికి కృషి చేస్తాం.
పంచాయతీలకు డబ్బులు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం మీరు కోర్టుకు వెళ్లండి జనసేన మీకు అండగా నిలుస్తుంది. 38 కేసులున్న వ్యక్తి సీఎం అయితే మిమ్మల్నీ నన్నూ ఎలా నియంత్రించగలరు. యువకులంతా ఓసారి ఆలోచించాలి. వైజాగ్ అంటే పారిశ్రామిక కాలుష్యం గుర్తుకు వస్తుంది. పరవాడ పారిశ్రామిక వాడ నుంచి వెలువడే కాలుష్యంపై ఎందుకు మాట్లాడరు. పొల్యూషన్ పై ఏనాడయినా ఆడిట్ చేశారా దీనిపై ఎవ్వరైనా మాట్లాడే వారే లేరే ? ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి.
మీ భవిష్యత్ ను మీరు నిర్ణయించుకోపోతే మీరే నష్టపోతారు మన బిడ్డలు నష్టపోతారు. కాలుష్యం అందరినీ సమూలంగా నాశనం చేస్తుంది. అందరినీ చంపేస్తుంది ఎదురు తిరగకపోతే మీరే నష్టపోతారు. వైజాగ్ ల్యాండ్ స్కాంలన్నింటినీ బయటకు తీస్తాం. మేం అధికారం లోకి వస్తే వందలు వందల ఎకరాలు దోచుకుంటున్న ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి చెబుతున్నా మీరు రెడీగా ఉండండి మేం పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం.
మీ శక్తిని మీరు గ్రహిస్తారా లేదా అన్నది ఆలోచించండి. మీరు సమూహ బలం ఎంతన్నది చాటండి. నేను ఎక్కడికి వెళ్లినా జనం వస్తున్నారు దీనిని బలం అనుకోను నమ్మకం అనుకుంటాను. ఇంతటి జనబలాన్నీ ఓట్లుగా మార్చుకోలేకపోతే ఇదంతా నిష్ప్రయోజనం అవుతుంది. అప్పుడు జగన్ వస్తారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఓటు చీలకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాం. ఈ సారి జగన్ రాకూడదు. జగన్ కావాలో వద్దో ఆలోచించుకోండి.
నా ప్రాధాన్యం నా నేల నా ఆంధ్ర నా దేశం మీరు నాకు ముఖ్యం అది గుర్తు పెట్టుకోండి. జగన్ ను పారిపోయేలా చేయండి. మీరెక్కడి పారిపోతారు మీరు పారిపోకండి నిలబడి ఉండండి. నేనిక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఇల్లు తీసుకుంటాను. మీరు భయపడకండి. 2024 ఎన్నికల వైసీపీని ఏం చేద్దాం ? ఒక్కసారి ఆలోచించండి.
వీరప్పన్ చేసిన గంధపు చెక్కల అక్రమ రవాణా ఎంత నేరమో,డేటా సేకరణ అంత నేరం. ఆంధ్రాలో అరాచక వాదం నిలువరింతకు ఏం చేద్దాం. అరాచకం ఆగాలంటే జగన్ పోవాలి. అభివృద్ధి జరగాలన్నా జనం బాగుండాలన్నా జగన్ ప్రభుత్వం పోవాలి. మనందరం బాగుండాలంటే జనసేన రావాలి. అందుకు ఏం చేద్దాం హల్లో ఏపీ ! బైబై వైసీపీ ! అని నినదిద్దాం. జగన్ కు వ్యతిరేకంగా ఓటు ద్వారా తీర్పు ఇద్దాం. జైహింద్.-రత్నకిశోర్ శంభుమహంతి.