365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 4,2022: హయత్ నగర్ పసుమాముల వద్ద శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు పార్టీని అడ్డుకున్నారు.
ఈ రేవ్ పార్టీలో 29 మంది యువకులు, నలుగురు మహిళలను అరెస్టు చేశారు. సమాచారం మేరకు గంజాయి, 11 కార్లు, ఒక బైక్, 28మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరంతా సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలకు చెందిన విద్యార్థులని తెలిసింది. సుభాష్ అనే వ్యక్తి పుట్టినరోజును పురస్కరించుకుని వారు రేవ్ పార్టీని జరుపుకుంటున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు. విద్యార్థులంతా గంజాయి తాగినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.