Sat. Sep 14th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఆగస్టు 29,2024: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రూపొందించిన రెండు కొత్త ప్రోడక్టులను గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ (జీఎఫ్ఎఫ్) 2024 కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఆవిష్కరించారు. 

వివిధ ఈఆర్పీలు, అకౌంటింగ్ ప్లాట్‌ఫామ్స్‌వ్యాప్తంగా బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు రూపొందించిన భారత్ బిల్‌పే (బీబీపీఎస్) ఫర్ బిజినెస్, చెల్లింపుల అధికారాలను బదలాయించడానికి (డెలిగేట్) యూజర్లకు వీలు కల్పించే యూపీఐ సర్కిల్ వీటిలో ఉన్నాయి.

భారత డిజిటల్ పేమెంట్ వ్యవస్థ సమగ్రత, భద్రత, సమర్ధతను మరింతగా మెరుగుపర్చేందుకు ఈ పేమెంట్ సొల్యూషన్స్ ఉపయోగపడగలవు.

ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఎన్‌పీసీఐ సలహాదారు నందన్ నీలేకని, ఎన్‌పీసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్,స్వతంత్ర డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి సమక్షంలో ఇవి ఆవిష్కరించాయి.

భారత్ బిల్‌పే ఫర్ బిజినెస్ (బీ2బీ ప్లాట్‌ఫామ్స్)

బిజినెస్ ఎనేబుల్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ల అవసరాలను తీర్చేందుకు, బీ2బీ చెల్లింపులు,వసూళ్లను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడేలా బీబీపీఎస్ సర్వీసులను విస్తరిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు. కేంద్రీకృతమైన, ఇంటరాపరబుల్‌గా ఉండే ఒకే ప్లాట్‌ఫాం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపార చెల్లింపుల స్వరూపాన్ని మార్చేందుకు ఇది తోడ్పడగలదనే అంచనాలు ఉన్నాయి.

వ్యాపార పరిమాణంతో సంబంధం లేకుండా రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి వివిధ ఇన్వాయిస్ పేమెంట్ ప్రక్రియలను ప్రామాణీకరించడం, సరళతరం చేయడం, ఆటోమేట్ చేయడమనేది భారత్ బిల్‌పే ఫర్ బిజినెస్ లక్ష్యం.

బిజినెస్ ఆన్‌బోర్డింగ్, సెర్చ్ అండ్ యాడ్ బిజినెస్, పర్చేజ్ ఆర్డర్ (పీవో) క్రియేషన్, ఇన్వాయిస్ నిర్వహణ, ఆటోమేట్ చేయబడిన రిమైండర్లు, గ్యారంటీడ్ సెటిల్మెంట్, ఫైనాన్సింగ్, ఏఆర్ (అకౌంట్స్ రిసీవబుల్),ఏపీ (అకౌంట్స్ పేయబుల్) డ్యాష్‌బోర్డ్, వివాదాల పరిష్కారానికి ఆన్‌లైన్ వ్యవస్థ మొదలైనవి ఇందులో ఉన్నాయి.

ఇప్పుడిక బ్యాంకులు, ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీలు), బీ2బీ ఫిన్‌టెక్ సంస్థలు, బీబీపీఎస్ ఫర్ బిజినెస్‌ను ఉపయోగించుకుని తమ క్లయింట్లకు సమగ్రమైన సొల్యూషన్స్ అందించవచ్చు.

ప్రస్తుత మ్యాన్యువల్ ప్రక్రియలను విస్తృతంగా డిజిటలీకరించేందుకు అలాగే ఆయా వ్యాపారాలను సమగ్రమైన, ఇంటరాపరబుల్‌గా ఉండే డిజిటల్ ఇన్వాయిస్,పేమెంట్ సొల్యూషన్‌లో చేర్చడం ద్వారా బీ2బీ సంస్థలు అందించే సేవలను మరింత మెరుగుపర్చేందుకు వ్యాపారాలకు అవసరమైన సాధికారతను ఈ సొల్యూషన్ అందిస్తుంది.

యూపీఐ సర్కిల్ (డెలిగేట్ పేమెంట్స్)

యూపీఐ యూజర్లు చెల్లింపు అధికారాలను విశ్వసనీయమైన సెకండరీ యూజర్లకు బదలాయించేందుకు ఉపయోగపడే యూపీఐ సర్కిల్‌ను ఆర్‌బీఐ గవర్నర్ ఆవిష్కరించారు.

ఈ విధానంలో యూపీఐ యూజరు ప్రాథమిక యూజరుగా ఉంటారు. చెల్లింపు అధికారాలను విశ్వసనీయమైన సెకండరీ యూజర్లకు పాక్షికంగా లేదా పూర్తిగా బదలాయించేందుకు యూపీఐ యాప్‌లో వారితో అనుసంధానమవుతారు.

పూర్తిగా బదలాయించడానికి (ఫుల్ డెలిగేషన్) సంబంధించి నిర్దేశిత వ్యయ పరిమితులకు లోబడి యూపీఐ లావాదేవీలను ప్రారంభించి,  పూర్తి చేసేందుకు విశ్వసనీయమైన సెకండరీ యూజరుకు ప్రైమరీ యూజరు అధికారాలు ఇస్తారు.

పాక్షిక డెలిగేషన్‌ విషయంలో పేమెంటు అభ్యర్ధన ప్రక్రియను ప్రారంభించే అధికారాలను మాత్రమే సెకండరీ యూజరుకు ప్రైమరీ యూజరు బదలాయిస్తారు. ఆ తర్వాత ఆ యూపీఐ లావాదేవీని యూపీఐ పిన్‌తో ప్రైమరీ యూజరు పూర్తి చేస్తారు.

అయిదుగురు సెకండరీ యూజర్లకు ప్రైమరీ యూజరు అధికారాలను బదలాయించవచ్చు. సెకండరీ యూజరు కేవలం ఒక్క ప్రైమరీ యూజరు నుంచి మాత్రమే డెలిగేషన్‌ను పొందవచ్చు.

పూర్తి డెలిగేషన్ విషయంలో ఒక్కో డెలిగేషన్‌కు గరిష్టంగా రూ. 15,000 నెలవారీ పరిమితి ఉంటుంది. అలాగే ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 5,000గా ఉంటుంది. పాక్షిక డెలిగేషన్ విషయంలో ప్రస్తుత యూపీఐ పరిమితులు వర్తిస్తాయి.

ఆవిష్కరణ కార్యక్రమంలో భీమ్ (BHIM) సహా యూపీఐ ఎనేబుల్డ్ యాప్స్ ద్వారా యూపీఐ సర్కిల్ పనితీరు లైవ్‌లో ప్రదర్శించబడింది.

error: Content is protected !!