365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 4,2023:స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండో సెషన్లోనూ పతనం కొనసాగింది. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, వినియోగ ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి.
ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. జపాన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, కొరియా మార్కెట్లూ భారీ పతనం చవిచూశాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లోనే ఉన్నాయి.
ముఖ్యంగా బ్యాంకు, ఫైనాన్స్ షేర్లు విలవిల్లాడాయి. నేడు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 92 పాయింట్లు, బీఎస్‌ఈ సెన్సెక్స్ 286 పాయింట్ల మేర తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.
క్రితం సెషన్లో 65,512 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,330 వద్ద మొదలైంది. 64,878 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,332 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
చివరికి 286 పాయింట్లు తగ్గి 65,226 వద్ద ముగిసింది. మంగళవారం 19,528 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,446 వద్ద ఓపెనైంది. 19,333 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది.
19,457 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 92 పాయింట్లు తగ్గి 19,436 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 435 పాయింట్ల నష్టంతో 43,964 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభపడగా 37 నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (3.23%), నెస్లే ఇండియా (3.03%), ఐచర్ మోటార్స్ (1.63%), హిందుస్థాన్ యునీలివర్ (1.61%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1.59%) టాప్ గెయినర్స్.
యాక్సిస్ బ్యాంకు (4.72%), ఎస్బీఐ (2.94%), ఎన్టీపీసీ (2.38%), ఇండస్‌ఇండ్ బ్యాంకు (2.33%), బజాజ్ ఆటో (2.20%) టాప్ లాసర్స్. రంగాల వారీగా పరిశీలిస్తే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ సూచీలో స్వల్ప పెరుగుదల కనిపించింది.
బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు భారీగా పతనమయ్యాయి.
నిఫ్టీ పతనంలో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్‌టీ, ఐటీసీ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యాక్సిస్ వల్లే 28 పాయింట్ల మేర పతనమైంది. అయితే ఆఖర్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 36 పాయింట్లు కంట్రిబ్యూట్ చేయడంతో కోలుకుంది.
ఇన్ఫీ, హెచ్‌యూల్ అండగా నిలిచాయి. నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,500 వద్ద రెసిస్టెన్సీ, 19,350 వద్ద సపోర్ట్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి సుజ్లాన్, డీమార్ట్, ఎస్కార్ట్, రామ్‌కో సిమెంట్, బంధన్ బ్యాంకు షేర్లు కొనుగోలు చేయొచ్చు.
రూ.10,000 కోట్ల విలువైన క్యూఐపీకి వస్తున్నట్టు మీడియాలో ప్రచారమైన వార్తలు అవాస్తవమని యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. అదానీ విల్మార్ షేర్లు 9 శాతానికి పైగా ఎగిశాయి.
రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు విడుదల చేస్తుందన్న అంచనాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు రెండు శాతానికి పైగా పెరిగాయి. నెలవారీ అమ్మకాలు తగ్గుతుండటంతో మారుతీ సుజుకీ నష్టాలు కొనసాగాయి.
అంతర్జాతీయంగా ధరలు తగ్గిపోవడంతో మెటల్ షేర్లు పతనం కొనసాగింది. ఐహెచ్‌సీ స్టేక్ పెంచుకోవడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు పెరిగాయి. ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు బాగా పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఎరుపెక్కాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709