Mon. Dec 23rd, 2024
realmec55_365

 365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 29,2023: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్స్ తో మరొక స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. “రియల్‌మి C55” పేరుతో విపణిలోకి విడుదల చేసింది. రియల్‌మి కొత్త C-సిరీస్ లో C అంటే ఛాంపియన్ కు ప్రతీకగా నిలుస్తుంది.

అసాధారణమైన పనితీరును అందిస్తుంది. యువతరం వ్యక్తిత్వం, శైలిని ప్రతిబింబించే కొత్త వ్యూహాత్మక అప్‌గ్రేడ్‌ తో మార్కెట్ లోకి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది రియల్ మీ.

కొత్త శ్రేణి సి – సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌లు కెమెరా, స్టోరేజ్, ఛార్జింగ్, డిజైన్ అనే నాలుగు కీలక రంగాలలో అసమానమైన సాంకేతిక అప్‌గ్రేడ్‌లతో సెగ్మెంట్‌ను ముందుకు నడిపిస్తాయి. 64MP కెమెరా అండ్ 33Wతో ఎంట్రీ-లెవల్ ఛాంపియన్ కొత్త బెంచ్‌మార్క్ రూ. 9,999 నుంచి ప్రారంభం.

realmec55_365

ఈ విభాగంలో అధిక స్టోరేజ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తూ, రియల్‌మి C55, 16GB వరకు డైనమిక్ RAMతో 8+128 GB స్టోరేజ్ ను అందిస్తుంది. MediaTek Helio G88 చిప్‌సెట్, 33W SUPERVOOC ఛార్జింగ్, 90Hz FHD+ డిస్ప్లే ఆధారితంగా, రియల్‌మి C55 సెగ్మెంట్‌లో అత్యధిక రిజల్యూషన్‌తో 64MP కెమెరాను కలిగి ఉంది.

ఛార్జ్ నోటిఫికేషన్, డేటా వినియోగ నోటిఫికేషన్, స్టెప్ నోటిఫికేషన్ అనే మూడు ముఖ్యమైన ఫీచర్‌లను అందించే మినీ క్యాప్సూల్‌ను ఫీచర్ చేసిన మొదటి రియల్‌మి ఫోన్ realme C55.

రియల్ మి C55 రెండు అద్భుతమైన రంగులలో లభిస్తుంది – సన్‌షవర్, రైనీ నైట్. వీటి ధర 4GB + 64GB కి రూ.10,999, 6GB+64GBకి రూ.11,999, 8GB+128GBకి రూ.13,999. realme.comలో రూ.1000 వరకు బ్యాంక్ ఆఫర్‌లు* Flipkartలో రూ.1000 ఎక్స్‌ ఛేంజ్ ఆఫర్‌లు ఉంటాయి.

మార్చి 28మధ్యాహ్నం 12 గంటల నుంచి realme.com, Flipkartలో అమ్మకాలు జరుగుతున్నాయి. మార్చి 28 నుంచి 31 మధ్య, వినియోగదారులు బ్యాంక్ ఆఫర్‌లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.

error: Content is protected !!