Mon. Sep 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 2,2023:స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గురువారం భారీ లాభాల్లో ముగిశాయి.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధ తీవ్రత తగ్గడం, ముడి చమురు ధరలు 95 నుంచి 85 డాలర్లకు పడిపోవడం, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచకపోవడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది.

అక్టోబర్ నెలలో విపరీతంగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ సంస్థాగత మదుపర్లు మళ్లీ బయ్యర్లుగా మారే అవకాశం ఉంది. ఆసియా, ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి.

ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సూచీలు తగ్గినా భారీ లాభాలే వచ్చాయి. నిఫ్టీ ఇలాగే పెరిగి 19,300 మీద నిలదొక్కుకుంటే మార్కెట్లో స్థిరత్వం వస్తుంది.

క్రితం సెషన్లో 63,591 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 64,033 వద్ద మొదలైంది. ఆరంభంలోనే ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 64,202కు చేరుకుంది. మధ్యలో ఒడుదొడుకులకు లోనై 63,815 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 489 పాయింట్ల లాభంతో 64,080 వద్ద ముగిసింది.

గురువారం 19,120 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,064 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. 19,175 వద్ద గరిష్ఠాన్ని అందుకొని మొత్తంగా 144 పాయింట్లతో 19,133 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 316 పాయింట్లు ఎగిసి 43,017 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభపడగా 8 నష్టపోయాయి. బ్రిటానియా, హిందాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్, ఐచర్స్ మోటార్స్ షేర్లు టాప్ గెయినర్లుగా అవతరించాయి.

హీరో మోటో, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్ టాప్ లాసర్స్. ఫియర్ ఇండెక్స్‌గా భావించే విక్స్ నేడు 8.07 శాతం తగ్గడం గమనార్హం.

నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, హెల్త్ కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ కళకళలాడాయి.

నవంబర్‌ నెల నిఫ్టీ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,300 వద్ద రెసిస్టెన్సీ, 19150 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో ఆర్‌ఈసీ లిమిటెడ్‌, పీఎఫ్‌సీ, రేమండ్‌, లోధా, హిందాల్కో షేర్లను కొనుగోలు చేయొచ్చు. నేడు నిఫ్టీ పెరుగుదలలో రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, టీసీఎస్‌ కీలక పాత్ర పోషించాయి.

టాటా మోటార్స్‌ మెరుగైన ఫలితాలు విడుదల చేసింది. వరుసగా నాలుగో త్రైమాసికంలో లాభం నమోదు చేసింది. ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,05,128 కోట్లుగా ఉంది.

ఎబిటా 147 శాతం ఎగిసింది. బజాజ్‌ ఫైనాన్స్‌లో ప్రమోటర్‌ తమ వాటాను మరింత పెంచుకుంటున్నారు. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.1,189 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నారు.

రెండో త్రైమాసికంలో డాబర్‌ ఇండియా మార్కెట్‌ అంచనాలను అందుకుంది. రెవెన్యూ 7.3శాతం పెరిగి రూ.3,203 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్‌ ప్రాఫిట్ 16 శాతం పెరిగింది.

అదానీ పవర్‌ అదరగొట్టింది. క్యూ2లో ఆదాయం 84.4 శాతం ఎగిసి రూ.12,991 కోట్లుగా నమోదైంది. ఎబిటా ఏకంగా 445 శాతం ఎగిసింది. లాభం రూ.696 కోట్ల నుంచి రూ.6,594 కోట్లుగా ఉంది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!