365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2023:భారత స్టాక్ మార్కెట్ సూచీలు రోజుకో రికార్డు బద్దలు కొడుతున్నాయి. సోమవారం బెంచ్‌మార్క్ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి.
సెన్సెక్స్ తొలిసారి 70,000 మార్క్ అందుకుంది. నిఫ్టీ 21,000 స్థాయిని టచ్ చేసింది. కార్పొరేట్ ఎర్నింగ్స్ సైకిల్ బాగుండటం, విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం.
వ్యాపార అనుకూల విధానాలు, కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉండటమే ఇందుకు కారణాలు. వీటికి తోడుగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.
మార్కెట్లు గరిష్ఠ స్థాయుల్లో కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.39 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.
క్రితం సెషన్లో 69,825 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 69,925 వద్ద ఆరంభమైంది. మరికాసేపటికే జీవితకాల గరిష్ఠమైన 70,057ను టచ్ చేసింది. ఆ తర్వాత కాస్త తగ్గి 69,782 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది.
మొత్తంగా 102 పాయింట్ల లాభంతో 69,928 వద్ద ముగిసింది. సోమవారం 20,965 వద్ద మొదలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,026 వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది. 20,923 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.
చివరికి 27 పాయింట్లు పెరిగి 20,997 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 52 పాయింట్లు ఎగిసి 47,314 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ50లో 28 కంపెనీలు లాభపడగా 22 నష్టపోయాయి. అల్ట్రాటెక్ సెమ్, యూపీఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండగియా, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం అత్యధికంగా నష్టపోయాయి.
నేడు ఫార్మా, హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.
నిఫ్టీ50 డిసెంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను గమనిస్తే 21,150 వద్ద రెసిస్టెన్సీ, 20,900 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి గ్లెన్‌మార్క్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అదానీ పోర్ట్, పవర్ గ్రిడ్, ఐచర్ మోటార్స్ షేర్లను కొనొచ్చు.
నిఫ్టీ పెరగడంలో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సెమ్, టెక్ మహీంద్రా, హిందాల్కో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి.
ట్రక్కుల్లో ఎయిర్ కండిషనింగును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు 6 శాతం ఎగిశాయి. నేడు సిమెంటు స్టాక్స్ దుమ్మురేపాయి.
ఆంధ్రా సిమెంట్స్ ఏకంగా 7 శాతం మేర లాభపడింది. అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఏషీసీ, అంబుజా, రామ్‌కో ఎగిశాయి. చక్కెర షేర్లూ తీపి పంచాయి. బజాజ్ హిందుస్థాన్, ఉత్తమ్ షుగర్, శ్రీ రేణుక షుగర్ షేర్లు 5 శాతం మేర పెరిగాయి.
శ్రీ భజరంగ్ అలియన్స్, నెస్లే ఇండియా కలిసి కొన్ని ఉత్పత్తులు తయారు చేయనున్నాయి. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకుల్లో 10 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఎల్ఐసీ తమ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగంలో రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేర్లు 5 శాతానికి పైగా పెరిగాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709