365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీశైలం,నంవంబర్ 25,2022:శ్రీశైలం దేవాలయానికి ఎన్నడూలేని విధంగా ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 55.51శాతం స్వామివారి రాబడి పెరిగింది. ఆలయ హుండీలు, ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్షసేవల ద్వారా 30 కోట్లపైగా మల్లన్నకు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
గత సంవత్సరం కార్తీకమాసంలో 19 కోట్లకు మేర ఉన్న మల్లన్న దేవస్థాన ఆదాయం ఈ ఏడాది 30కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 55.51శాతంపైగా దేవస్థానం ఆదాయం పెరిగింది.

క్షేత్రంలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు ఘనంగా కార్తీక మసోత్సవాలు జరిగాయి. మొదటిసారిగా కార్తీకమాసంలో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 30 కోట్ల 89 లక్షల 27 వేల 503 రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.