
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్9, 2021: నాన్ బ్యాంకింగ్ రంగంలో క్రెడిట్ చెల్లింపుల నివేదిక ఫిన్‌టెక్ వేదిక రికార్డెంట్ ఫుడ్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఎస్‌డీఏ)తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో సమగ్రమైన క్రెడిట్ డాటా నివేదికలను ఎఫ్‌ఎస్‌డీఏ సభ్యులకు రికార్డెంట్ సాస్ ఆధారిత సాంకేతిక వేదిక ద్వారా తీసుకురావడం సాధ్యమవుతుంది.
రికార్డెంట్ సీఈఓ అండ్ కో-ఫౌండర్ విన్నీపాత్రో మాట్లాడుతూ ‘‘మొత్తం ఎఫ్ అండ్ బీ పరిశ్రమ ఇప్పుడు చెల్లింపుల పరంగా అసాధారణ ఆలస్యంను ఎదుర్కోవడంతో పాటుగా మహమ్మారి సమమంలో నగదు పరంగా కష్టాలనూ ఎదుర్కొంది. ఇది డాటా నెట్‌వర్క్‌ను నిర్మించాల్సిన ఆవశ్యకతను సృష్టించింది. ఈ భాగస్వామ్యంతో, వ్యాపార సంస్థలకు తమ రిస్క్ తగ్గించుకునే సామర్థ్యం లభించడంతో పాటుగా వ్యాపార వృద్ధిలో ఎదురయ్యే ఒడిదుడుకల వేళ ఆర్ధిక నష్టాలను తగ్గించుకోవడమూ సాధ్యమవుతుంది. వినియోగదారులు చక్కటి చెల్లింపుల చరిత్రను నిర్వహించేందుకు ఇది ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.
‘‘ఎఫ్‌ఎస్‌డీఏతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పరిశ్రమ వేగంగా కోలుకునేందుకు సహాయపడేలా మా నైపుణ్యం వినియోగించనున్నాము. మా వద్ద జాబితా చేసిన ఎఫ్‌ఎస్‌డీఏ సభ్యులు కలెక్షన్స్ పరంగా నాటకీయంగా మార్పులు చూడగలిగారు’’ అని ఆయన అన్నారు.
ఎఫ్‌ఎస్‌డీఏ అధ్యక్షులు కేయూర్ భాటియా మాట్లాడుతూ ‘‘రికార్డెంట్‌తో మా భాగస్వామ్యం , భారతదేశపు మొట్టమొదటి మరియు మా సొంత క్రెడిట్ బ్యూరోను ఎఫ్ అండ్ బీ పరిశ్రమ కోసం నిర్మిస్తుంది. ఇప్పుడిది తక్షణావసరం. ఈ ప్రయత్నాలతో చక్కటి క్రెడిట్ అవగాహన కల్పించడంతో పాటుగా ఋణగ్రహీతల నడుమ చక్కటి క్రెడిట్ సంస్కృతి సైతం వృద్ధి చెందుతుంది’’ అని అన్నారు.