
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 25,2021:దేశంలో కార్డియాక్ కేర్‌ను సమూలంగా మార్చడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ,కంపాక్ట్ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఎలకో్ట్రకార్డియోగ్రామ్ (ఈసీజీ) టెక్నాలజీలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన ఎలైవ్‌కోర్, విజయవంతంగా హైదరాబాద్‌లో నేడు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) సదస్సును పూర్తి చేసింది. ఈ సదస్సులో భాగంగా, ప్రపంచంలో మొట్టమొదటి, ఎఫ్‌డీఏ అనుమతించిన సిక్స్ లీడ్ కంపాక్ట్ ఈసీజీ ఉపకరణం– కార్డియా మొబైల్ 6ఎల్‌ను నగరంలోని సుప్రసిద్ధ కార్డియాలజిస్ట్‌లు, ఫిజీషియన్లకు పరిచయం చేసింది. ఈ కార్యక్రమానికి బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనూప్ అగర్వాల్ నేతృత్వం వహించారు. ఈ సదస్సులో సుప్రసిద్ధ వైద్య సంస్థలకు చెందిన పలువురు సీనియర్ కార్డియాలజిస్ట్‌లు/ఫిజీషియన్లు పాల్గొనడంతో పాటుగా లక్షలాది మందికి గుండె ఆరోగ్యం అందించడంలో నూతన ఆరోగ్య సాంకేతిక ఉపకరణాలు, చికిత్సలో సాంకేతికత పాత్ర సహా కార్డియో మొబైల్ 6ఎల్ గురించి చర్చించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూప్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘విభిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులపై కోవిడ్ తీవ్రంగా ప్రభావం చూపుతుండటంతో పాటుగా రోగి చికిత్స పరంగానూ అనేక సవాళ్లను విసురుతుంది. గత సంవత్సర కాలంలో , దేశ వ్యాప్తంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం మేము చూస్తున్నాం. వయసు మీద పడిన వ్యక్తులు మరింతగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా వరకూ ఈ తరహా కేసులను సమయానికి కనుగొనడంతో పాటుగా నిరంతర పర్యవేక్షణ ద్వారా నిర్వహించవచ్చు. ఇది దృష్టిలో పెట్టుకుని , ఎలైవ్‌కోర్ ,కార్డియామొబైల్ 6ఎల్ లాంటి ఆవిష్కరణలు రోగి కేంద్రీకృత క్లీనికల్ ఫలితాలను అందించడంలో తోడ్పడతాయి. ఈ మెషీన్‌తో ఎక్కడైనా /ఎప్పుడైనా మెడికల్ గ్రేడ్ ఈసీజీ/ఈకెజీ నిర్వహించడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
ఎలైవ్‌కోర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లోకేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే మనదేశంలో 8–10 సంవత్సరాల ముందుగానే గుండె వ్యాధులు వస్తున్నాయి. తగినంత వ్యాయామం చేయకపోవడం, సరైన డైట్ తీసుకోకపోవడం, ఊబకాయం, మధుమేహం, జన్యు పరమైన కారణాలు దీనికి కారణం. దీనికి తోడు కోవిడ్ –19 ఇప్పుడు పరిస్థితిని మరింత దిగజార్చింది. మా నూతన కార్డియామొబైల్ 6ఎల్ దేశంలో కార్డియాక్ కేర్‌ను సమూలంగా మార్చడంలో ఓ ముందడుగుగా నిలువనుంది. కృత్రిమ మేథస్సు సహాయంతో రిమోట్‌గా ఈసీజీ చూడడం దీనితో సాధ్యమవుతుంది..’’ అని అన్నారు.
