365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, డిసెంబర్ 30, 2025: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా, అలాగే కొన్ని వార్తా కథనాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కేంద్ర ప్రభుత్వాన్ని భారీ మొత్తంలో ఆర్థిక సహాయం కోరిందన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రిలయన్స్(Reliance)అధికారికంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది.

తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు లేదా అధికారిక లేఖలు అందలేదని రిలయన్స్ వెల్లడించింది. అలాగే 30 బిలియన్ డాలర్ల డిమాండ్ అన్నది పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది.

వివాదం నేపథ్యం ఏమిటి..?

ఈ ప్రచారం ప్రధానంగా కేజీ–డీ6 (KG-D6) గ్యాస్ బ్లాకులకు సంబంధించిన లాభాల పంపక అంశానికి సంబంధించి వచ్చినట్లు తెలుస్తోంది.

చమురు, గ్యాస్ ఉత్పత్తి విషయంలో సాధారణంగా ప్రభుత్వం–సంస్థల మధ్య ముందుగా కుదిరిన ఒప్పందాల ప్రకారం లాభాల పంపకం జరుగుతుంది. అయితే ఉత్పత్తి వ్యయం లేదా లెక్కల్లో తేడాలుంటే వివాదాలు తలెత్తే అవకాశముంది.

ఇదీ చదవండి :గట్ ఆరోగ్యానికి వరం లాంటివి.. దక్షిణ భారత అల్పాహారాలు..

ఇదీ చదవండి :‘సంపూర్ణ శరీర ఆరోగ్యం’ కోసం నోటి సంరక్షణ విప్లవం..!

Read this also: Dr. Sonia Datta Calls for a “Total Body” Oral Wellness Revolution in 2026..

ఇదీ చదవండి :పెట్టుబడిదారులకు షాకిచ్చిన టైమెక్స్ ఇండియా..

ఈ నేపథ్యంలోనే రిలయన్స్ భారీగా నిధులు చెల్లించాల్సి ఉందని, అందుకే ప్రభుత్వం పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసిందన్న ప్రచారం జరిగింది.

రిలయన్స్ స్పందన..

ఈ ఆరోపణలను రిలయన్స్ సంస్థ ఖండించింది. 30 బిలియన్ డాలర్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఏవైనా బకాయిలు లేదా వివాదాలు ఉంటే అవి చట్టపరమైన మార్గాలు, ముఖ్యంగా ఆర్బిట్రేషన్ ప్రక్రియ ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం అలాంటి డిమాండ్ ఏదీ లేదని పేర్కొన్నారు. దేశీయ ఇంధన రంగంలో తాము నిబంధనల ప్రకారమే పెట్టుబడులు కొనసాగిస్తున్నామని రిలయన్స్ వెల్లడించింది.

స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లపై ప్రభావం పడకుండా ఉండడం, అలాగే మదుపర్లలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడమే ఈ స్పష్టీకరణ వెనుక కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.