Fri. Oct 11th, 2024
  • కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి చేత ప్రారంభం
  • యువతకు నైపుణ్యాలు, పునఃనైపుణ్యాలు ,మెరుగైన నైపుణ్యాలను అందించడం లక్ష్యం
  • నూతన యుగపు సాంకేతికతతో ఉద్యోగ అవకాశాలను సులభతరం చేస్తుంది
  • వైవిధ్యభరిత పరిశ్రమ నిపుణుల నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కల్పిస్తుంది
  • AICTE తో భాగస్వామ్యం ద్వారా అకాడమీ పరిధిని ప్రభావాన్ని పెంచుతుంది

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 7,2024:దేశంలో జాబ్ మార్కెట్ కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ లక్ష్యంతో ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’ ని ప్రారంభించింది. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌధరి ఈ అకాడమీ ని లాంఛనంగా ప్రారంభించారు.

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందులో ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ పరిరక్షణ, పరిశ్రమ, పౌర సమాజం,విద్యా రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. స్కిల్ బిల్డింగ్, ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుంది.

పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్మెంట్ కు తోడ్పాటును కూడా ఇవ్వనుంది.

ప్రారంభోత్సవం సందర్భంగా, జయంత్ చౌధరి మాట్లాడుతూ, “యువతలో జీవితకాల అధ్యయనం అనే సంస్కృతిని ప్రోత్సహించడం మా లక్ష్యం.

యువతను శక్తివంతం చేయాలనే భారత ప్రధానమంత్రి విజన్‌ కు అనుగుణంగా, నేను ఈ రోజు ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’ ని ప్రారంభించడం సంతోషకరం.

ఇది యువతకు 21వ శతాబ్దం నైపుణ్యాలను అందించడంలో ఒక అడుగు ముందుకేసిన కార్యక్రమం.” అన్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ CEO జగన్నాథ కుమార్ మాట్లాడుతూ, “యువత ఆశయాలను నెరవేర్చడంలో సహకరించడం రిలయన్స్ ఫౌండేషన్ ప్రాథమిక లక్ష్యాల్లో భాగం. ఈ స్కిల్లింగ్ అకాడమీ యువతను భవిష్యత్ ఉద్యోగాల కోసం సిద్ధం చేయడంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది” అని పేర్కొన్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ www.rfskillingacademy.com ప్లాట్‌ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది.

error: Content is protected !!